Big Breaking : కేసీఆర్ కు తీవ్ర గాయాలు.. హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలింపు
ప్రధానాంశాలు:
ఇంట్లో కాలు జారి పడ్డ కేసీఆర్
హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన నిన్న రాత్రి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తన ఇంట్లో కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగి గాయాలయ్యాయి. వెంటనే అర్ధరాత్రి ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
కాలు జారి కింద పడటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. కాలికి ఫ్రాక్చర్ అయినట్టు చెబుతున్నారు. కేసీఆర్ కు జరిగిన విషయం తెలుసుకొని వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడిని వేడుకుంటున్నారు.
Advertisement
WhatsApp Group
Join Now