KCR : నా ఇంటికి రావొద్దు.. నాతో మాట్లాడొద్దు.. కవితకి కేసీఆర్ తెగేసి చెప్పాడా..?
KCR : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు.ఐదు నెలల తర్వాత కుమార్తెను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కవిత వెంట […]
ప్రధానాంశాలు:
KCR : నా ఇంటికి రావొద్దు.. నాతో మాట్లాడొద్దు.. కవితకి కేసీఆర్ తెగేసి చెప్పాడా..?
KCR : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు.ఐదు నెలల తర్వాత కుమార్తెను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కవిత వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పదిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.
KCR సైలెంట్‌గా ఉండు..
అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఎక్కడ కనిపించిన సందర్భాలు లేవు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని బెయిల్ వచ్చిన రోజు తీహార్ జైలు గేటు దగ్గర ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చిన కవిత మళ్లీ అంత ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. దీనికి కారణం కెసిఆర్ కవితకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట.మళ్లీ తనని కలవడానికి రావద్దని, తనతో మాట్లాడొద్దని కెసిఆర్ తన కూతురికి కరాకండిగా చెప్పేశారట. అంతేకాదు ఇంట్లోంచి బయటకు వచ్చి అతివాగుడు బాగోదని కూడా కెసిఆర్ కవితకు తెగేసి చెప్పాడట.కవిత జైలుకి వెళ్లినప్పటి నుండి కేసీఆర్ రాజకీయంగా చాలా వెనకపడ్డారు.
కవిత చేసిన పనికి బిజెపి వాకిట ముందు కేసీఆర్ మోకాలు వేయాల్సి వచ్చింది. బిజెపి తన ఎమ్మెల్యేలను కొంటుందని స్టింగ్ ఆపరేషన్ చేసి మరి బి ఎల్ సంతోష్ తో పాటు పలువురిపై కేసులు పెట్టే అంత సాహసం చేసిన కెసిఆర్…. కవిత ఎపిసోడ్ తర్వాత సైలెంట్‌గా కూర్చోవలసి వచ్చింది. కవిత అరెస్టు వలన లోక్సభ ఎన్నికల్లోనూ బి ఆర్ ఎస్ కు, కెసిఆర్ కు సానుభూతి రాలేదు సరి కదా, దారుణ ఓటమి ఎదురైంది. ఇదంతా కవిత పుణ్యమే నని అని పార్టీలోనూ, బయట జనం బలంగా నమ్మారు. పైకి మా కూతురు నిర్దోషి, కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అని కేసీఆర్ చాలాచోట్ల చెప్పుకున్నా అసలు విషయం తెలిసి ఎవరు కూడా వారిని సపోర్ట్ చేయడం లేదు. కవిత అరెస్టు తర్వాత కెసిఆర్ మళ్లీ ఎన్నడు బిజెపిని గాని, మోడీని గాని పన్నెత్తు మాట అనలేదు. అలాంటి సాహసం ఎక్కడా చేయలేదు.