BC Reservation : తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక పరిమాణం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BC Reservation : తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక పరిమాణం..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఆర్డినెన్స్ ను సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్..!

  •  BC Reservation : తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక పరిమాణం..!

BC Reservation : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచేందుకు చేసిన ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణ చేస్తూ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఓ ఆర్డినెన్స్ ముసాయిదా రూపొందించి గవర్నర్‌కు సమర్పించింది. ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం హద్దును మించి రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రానికి హక్కు ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఈ ఆర్డినెన్స్‌పై కేంద్ర హోంశాఖ న్యాయ సలహా కోరుతూ ముసాయిదాను పంపించారు.

BC Reservation తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక పరిమాణం

BC Reservation : తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక పరిమాణం..!

BC Reservation : బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం లో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు

ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించేందుకు గడువు తీసుకుంటుండటంతో బీసీ రిజర్వేషన్ల అంశం మరింత ఆలస్యం కావచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అడ్వకేట్ జనరల్‌తో పాటు న్యాయ నిపుణులతో ఈ సవరణపై సంప్రదింపులు జరిపింది. అయితే గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖకు ఫార్వర్డ్ చేయడంతో తుది నిర్ణయం ఇప్పుడంతా కేంద్రం చేతుల్లోకి చేరింది. ఇది ఆర్డినెన్స్ అమలులో జాప్యానికి దారితీసే అవకాశం ఉంది.

ఇక మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రాకపోతే ఎన్నికలు నిర్వర్తించడంలో ప్రాజనన్యతలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, ముందు ఈ సమస్య పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యంగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది