KTR : కేతిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నకేటీఆర్ ని టార్గెట్ చేసిన ఏపీ మంత్రి.. స్నేహితుడి గురించి ఆ విషయాలు తెలియదా..?
ప్రధానాంశాలు:
KTR : కేతిరెడ్డికి సపోర్ట్ చేస్తున్న కేటీఆర్ ని టార్గెట్ చేసిన ఏపీ మంత్రి.. స్నేహితుడి గురించి ఆ విషయాలు తెలియదా..?
KTR : ఇటు తెలంగాణాలో బి.ఆర్.ఎస్ ఓటమి.. అటు ఏపీలో వైసీపీ ఓటమి రెండు పార్టీలు తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని ఓడించి వైఎస్ జగన్ ని గద్దె దించారు. వై నాట్ 175 అన్న దగ్గర నుంచి 11 కే వారి సంఖ్య పడిపోయింది. 2019 లో టీడీపీకి కనీసం 23 అయినా వచ్చాయి కానీ వైసీపీకి అందులో సగం వచ్చే సరికి ప్రజల్లో వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమైంది. ఇదిలాఉంటే కొందరు ప్రజల తో పాటే ప్రజల సమస్యలు తెలుసుకున్న నేతలను కూడా ఓడించారు. వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు అలాంటి ఆయన్ను కూడా ఓడించారు. ఈ విషయంపై రీసెంట్ గా ఢిల్లీ లో కె.టి.ఆర్ మాట్లాడారు. ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి వార్ సమస్యలు అడిగి తెలుసుకున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడటం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు.
KTR సందు గొందుల్లో కేతిరెడ్డి అక్రమాలు
ఐతే దీనికి స్పందంగా ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆన్సర్ ఇచ్చారు. కె.టి.ఆర్ కు ఎవరో తన ఫ్రెండ్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన పొద్దున్నే లేచి ప్రజల సమస్యల గురించి తెలుసుకునేందుకు కాదు ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్ లు ఉన్నాయో వాటిని కబ్జా చేసేందుకు తిరిగాడని ఆయన అన్నారు.
గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సందుగొందుల్లో తిరిగి ప్రైవేట్ ఆస్తులను కాజేశాడని సత్యకుమార్ అన్నారు. ఇవేమి తెలుసుకోకుండా కేతి రెడ్డి పైన కనిపించేంత మనోడు కాదన్న విషయం కె.టి.ఆర్ కు తెలియదా అని అన్నారు. ఓడిన కె.టి.ఆర్, జగన్, కెతిరెడ్డి ముగ్గురు కలిసి ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారంటూ సత్య కుమార్ ఎద్దేవా చేశారు. ప్రజలకు ముఖ్యంగా పేదలకు మంచి చేసినా సరే ఏపీ ప్రజలు వైఎస్ జగన్ ని ఓడించారని కె.టి.ఆర్ కామెంట్స్ ఏపీలో ఆయన్ను టార్గెట్ చేసేలా చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడాన్ని కె.టి.ఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.