CM Revanth Reddy : రేవంత్ మరో బాంబ్ పేల్చబోతున్నారా.. లిస్ట్ రెడీ ముహూర్త్వం కూడా..!
ప్రధానాంశాలు:
CM Revanth Reddy : రేవంత్ మరో బాంబ్ పేల్చబోతున్నారా.. లిస్ట్ రెడీ ముహూర్త్వం కూడా..!
CM Revanth Reddy : తెలంగాణాలో Telangana అధికార పార్టీ కాంగ్రెస్ Congress Party , బీ ఆర్ ఎస్ పార్టీ BRS Party నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేళ్ల తర్వాత తెలంగాణాలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీ ఆర్ ఎస్ పాలనలొ జరిగిన అవినీతిని ఎండగట్టే కార్యక్రమం మొదలు పెట్టింది. బీ ఆర్ ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జర్గిన ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలతో పాటు భూదందాలు, మిగతా అక్రమాలపై దృష్టిపెట్టింది. వీటికి సంబందించిన విచారణ జరుగుతుంది. మరోపక్క ధరణి లో అక్రమాలను బయట పెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ప్రభుత్వం కేలక నేతల మెడకు చుట్టుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఈమధ్య పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు బాంబ్ పేల్చే లిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది.
CM Revanth Reddy : లిస్ట్ లో ఎవరెవరి పేర్లు..
ఐతే ఈ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఆసక్తిగా మారింది. తెలంగాణాలో త్వరలో కీలక నేతల అరెస్ట్ ఖాయమన్నట్టు చర్చ నడుస్తుంది. బీ ఆర్ ఎస్ నేతల అక్రమాల ఫైళ్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో కీలక నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. నవంబర్ ఒలి వారంలోనే ఇవి బయట పెడతారని ముఖ్య నేతల నుంచి లీకులు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన పది నెలల్లో బీ ఆర్ ఎస్ నేతల భరతం పట్టేందుకు ప్రయత్నిస్తుంది.
ముఖ్యంగా భూ అక్రమాలు, ధరణి, ఫోన్ ట్యాపింగ్ అంశాల పై పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు తెలుస్తుంది. కుంభకోణాలు, ఆస్తుల రికవరీతో పాటు అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి చెబుతున్నారు. సో రానున్న రెండు మూడు వారాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీ ఆర్ ఎస్ ఫైట్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.