M Parameshwar Reddy : ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీ సమస్యలపై పరమేశ్వర్ రెడ్డి గారికి వినతి పత్రం
ప్రధానాంశాలు:
M Parameshwar Reddy : ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీ సమస్యలపై పరమేశ్వర్ రెడ్డి గారికి వినతి పత్రం
M Parameshwar Reddy : ఉప్పల్ Uppal Hanuman Nagar హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గ Congress Party కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి Mandumula Parmeshwar reddy శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారిని ఈ రోజు కలిసి కాలనీ సమస్యలు వివరించడం జరిగింది. ఉప్పల్ టు చిలుకనగర్ వెళ్లె మెయిన్ రోడ్డులో హనుమాన్ నగర్ కమాన్ పక్కన ఉన్న రోడ్డుకు అడ్డంగా ఒక చిన్న కాలువ ఉంది. అది చాలా సంవత్సరాల క్రితం వేయడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం మెయిన్ రోడ్డు పక్కన బీరప్పగడ్డ, శ్రీనగర్ కాలనీ వైపు ఉన్న కాలువలు పెద్దగా చేశారు .

Parameshwar Reddy : ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీ సమస్యలపై పరమేశ్వర్ రెడ్డి గారికి వినతి పత్రం
M Parameshwar Reddy : సమస్యను త్వరలో పరిష్కరిస్తాం : శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి
కానీ హనుమాన్ నగర్ కమాన్ దగ్గర రోడ్డుకు అడ్డంగా ఉన్న కాలువను మాత్రం పెద్దగా చేయకపోవడం వల్ల వర్షకాలం పై నుంచి వచ్చే వర్షం నీరు ఫ్లో ఎక్కవై ఆ చిన్న కాలువ నుంచి ఔట్ ఫ్లో వెళ్లలేక రోడ్డుపై ఓ పెద్ద చెరువును తలపిస్తుంది. ఆ వర్షం నీరు మొత్తం మా కాలనీలోకి రావడంతో హనుమాన్ నగర్ కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పరమేశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది . ఈ సమస్యపై శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది.
వెంటనే ఈ సమస్యను పరిష్కరించవల్సిందిగా హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆయనను కోరడంతో శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి కాలనీ ప్రజల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు గంటా రవీందర్ రెడ్డి , కోమటి రెడ్డి కృష్టారెడ్డి, ఏనుగు మల్లారెడ్డి , తొల్పునూరి నవీన్ కుమార్ గౌడ్, తరువు రమేష్, తండు రాము గౌడ్, పెద్ది అమరేందర్ రెడ్డి, ఇట్టిరెడ్డి రామచంద్రారెడ్డి, కనికె శ్రీరాములు ముదిరాజ్ పాల్గొనడం జరిగింది.