M Rajitha Parmeshwar Reddy : బల్దియాను దివాలా దీయించింది మీరు కాదా ? బీఆర్ఎస్ ను ఉతికారేసిన రజతాపరమేశ్వర్ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

M Rajitha Parmeshwar Reddy : బల్దియాను దివాలా దీయించింది మీరు కాదా ? బీఆర్ఎస్ ను ఉతికారేసిన రజతాపరమేశ్వర్ రెడ్డి

 Authored By ramu | The Telugu News | Updated on :31 January 2025,12:37 pm

ప్రధానాంశాలు:

  •  M Rajitha Parmeshwar Reddy సీఎం రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రంలో ప్రతి చోట అభివృద్ధి జరుగుతుంది

M Rajitha Parmeshwar Reddy  బల్దియాను దివాలా దీయించింది బీఆర్ఎస్ BRS Party ప్రభుత్వమేనని uppal corporator  ఉప్పల్ కార్పొరేటర్ మందుములు రజిత పరమేశ్వర్ రెడ్డి Mandumula Rajitha Parmeshwar Reddy  ఆరోపించారు. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని రూ. 7000 కోట్ల అప్పులు చేసి నేడు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. కనీసం రాష్ట్రంలోని ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం అని విమర్శించారు.జిహెచ్ఎంసి కౌన్సిల్ ghmc council సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ల ను ఉద్దేశించి కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి M Rajitha Parmeshwar Reddy మీడియాతో మాట్లాడారు.

M Rajitha Parmeshwar Reddy బల్దియాను దివాలా దీయించింది మీరు కాదా బీఆర్ఎస్ ను ఉతికారేసిన రజతాపరమేశ్వర్ రెడ్డి

M Rajitha Parmeshwar Reddy : బల్దియాను దివాలా దీయించింది మీరు కాదా ? బీఆర్ఎస్ ను ఉతికారేసిన రజతాపరమేశ్వర్ రెడ్డి

2014కు పూర్వం జిహెచ్ఎంసికి GHMC ఫిక్సుడు డిపాజిట్లు ఉండేవని గుర్తు చేశారు. జిహెచ్ఎంసి గల్లపెట్టే నిండుగా ఉండేదన్నారు. అప్పుడు ఏడాదికి రూ. 400 కోట్లకు పైగా నిధులు విడుదల అయ్యేవి. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జిహెచ్ఎంసిని సైతం అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు త్తారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నిర్జీవంగా ఉన్న జిహెచ్ఎంసికి పునర్జీవం పోస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్ల నిధులను జిహెచ్ఎంసీకిచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇదే కాకుండా రాష్ట్ర బడ్జెట్లోనూ మరో రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించిందన్నారు.

M Rajitha Parmeshwar Reddy ఉప్పల్ నియోజకవర్గంలో రూ .200 కోట్లతో అభివృద్ధి

గత బి.ఆర్ BRS ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉన్నచోట్లా రూపాయల నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆ నియోజకవర్గాలకు నిధులు రాక, అభివృద్ధి పనులు జరుగక అనాధలుగా మిగిలిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కానీ రేవంత్ అన్న అందుకు భిన్నంగా రాష్ట్ర అభివృద్ధిని చేస్తున్నారని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ లేరన్నారు అయినప్పటికీ ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లకు పైగా నిధులను కేటాయించి అభివృద్ధి పనులను చేయిస్తున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పేదల కోసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ అన్న రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ప్రతిపక్షం ఉన్నా , అధికారపక్షం ఉన్నా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి