Telangana Budget 2023 : విద్య, వైద్య రంగాలకు తెలంగాణ బడ్జెట్ లో పెద్ద పీట.. ఎంత కేటాయించారో తెలుసా?
Telangana Budget 2023 : తెలంగాణ బడ్జెట్ 2023 ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు రంగాలకు ఎంత కేటాయింపులు ప్రభుత్వం చేసిందో సభలో వెల్లడించారు. అయితే.. ఈ సారి విద్య, వైద్య రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎందుకంటే.. పేద, బడగు, బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యంగా అందాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం.
నేడు విద్య, వైద్యం కూడా కార్పొరేట్ అయిపోవడంతో సామాన్యులు వీటిని పొందడం కష్టంగా మారింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఈ బడ్జెట్ లో కల్పించింది. విద్య రంగానికి ఎప్పుడూ లేనంతగా ఈ సారి రూ.19,093 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.
Telangana Budget 2023 : వైద్య రంగానికి కేటాయింపులు ఎన్ని?
ఇక.. ఎన్నడూ లేని విధంగా వైద్య రంగానికి రూ.12,161 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడం కోసం ఈసారి భారీగా వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయింపులు చేసింది.