KTR : తన పుట్టిన రోజు నాడు ఎవ్వరూ సాహసం చేయని నిర్ణయం తీసుకున్న కేటీఆర్..!
KTR : ఇవాళ మంత్రి కేటీఆర్ KTR పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రమంతా బీఆర్ఎస్ BRS నేతలు, కేటీఆర్ అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్రమంతా ఇవాళ హడావుడి వాతావరణం నెలకొన్నది. మంత్రి కేటీఆర్ మాత్రం ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా తన పుట్టినరోజు నాడు ఎలాంటి ఆర్భాటాలు చేయకూడదని మంత్రి చెబుతూనే ఉంటారు. కానీ.. ఆయన అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాత్రం అస్సలు ఊరుకోరు. ఆయన పుట్టిన రోజు నాడు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
తాజాగా ఆయన పుట్టిన రోజు నాడు మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు తమ పుట్టిన రోజు నాడు ఎవ్వరూ చేయని సాహసం చేశారనే చెప్పుకోవాలి. ఆయనకు ఇవాళ్టికి 47 సంవత్సరాలు పడుతున్నాయి. ఈనేపథ్యంలో 47 మంది అనాథలకు సాయం చేస్తా అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.47 మంది అనాథలను ఆయన దత్తత తీసుకున్నంతగా వాళ్ల కోసం పలు సాయాలు చేయనున్నారు కేటీఆర్. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో ఉన్న 47 మంది అనాథలకు సాయం చేస్తా అన్నారు. పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు చదువుకు అయ్యే ఖర్చుతో పాటు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా 47 మంది ల్యాప్ టాప్ లు అందిస్తా అని..
KTR : ఆ విద్యార్థుల చదువు బాధ్యత నాదే
అలాగే రెండేళ్ల పాటు వాళ్ల కోచింగ్ బాధ్యతలను తీసుకుంటా అని ప్రకటించారు. అలాగే.. తన పుట్టిన రోజు వేడుకల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకుండా ఆ డబ్బులతో అనాథ పిల్లలకు అండగా నిలవాలంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చాలామంది నేతలు ఈ దేశంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నారు కానీ.. తమ పుట్టిన రోజు నాడు ఎవ్వరూ చేయని సాహసం ఆయన చేశారు. మనసున్న గొప్ప నేత అని మరోసారి నిరూపించుకున్నారు.