Minister Seethakka : అంగన్ వాడీలకు మంత్రి సీతక్క శుభవార్త..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Minister Seethakka : అంగన్ వాడీలకు మంత్రి సీతక్క శుభవార్త..!

Minister Seethakka : తెలంగాణా పణాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీలకు మంచి శుభవార్త చెప్పారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు కానుకలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెలంగాణా వ్యాప్తంగా ఉన్న 35700 అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ఒక్కొక్కరికి రెండేసి చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం లో అధికారులతో సీతక్క సమీక్ష జరిపారు. క్వాలిటీ చీరలు ఇచ్చేలా చూడాలని అధికారులకు చెప్పారు. అంగన్ వాడీ సిబ్బందికి ప్రభుత్వ ఎప్పుడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 November 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Minister Seethakka : అంగన్ వాడీలకు మంత్రి సీతక్క శుభవార్త..!

Minister Seethakka : తెలంగాణా పణాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీలకు మంచి శుభవార్త చెప్పారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు కానుకలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెలంగాణా వ్యాప్తంగా ఉన్న 35700 అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ఒక్కొక్కరికి రెండేసి చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం లో అధికారులతో సీతక్క సమీక్ష జరిపారు. క్వాలిటీ చీరలు ఇచ్చేలా చూడాలని అధికారులకు చెప్పారు. అంగన్ వాడీ సిబ్బందికి ప్రభుత్వ ఎప్పుడు అండగానే ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. చిన్నారుల భవిష్యత్తుకి అమ్మలాగా తీర్చిదిద్దే అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల సేవ గురించి సీతక్క కొనియాడారు. ఆర్ధిక సమస్యలతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని ఆమె అన్నారు. అయినా సరే అంగన్ వాడీలకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆలస్యం అయ్యాయని అన్నారు. పదిరోజుల్లో దానికి సంబందించిన జీవో వస్తుందని సీతక్క చెప్పారు.

Minister Seethakka అంగన్వాడీలకు సొంత బిల్డింగ్..

అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీలకు సొంత బిల్డింగ్ లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంగన్ వాడీ లకు ఉచిత విద్యుత్ అందిస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నట్టుగా మౌలిక వసతులు కూడా కల్పిస్తామని అన్నారు. 16 ఏళ్ల తర్వాత పాఠశాల, వసతి గృహాల్లో ఉండే విద్యార్ధులకు కాస్మొటిక్ ఛార్జీలు, ఏడేళ్ల తర్వాత డైట్ డైట్ చార్జీలు 40 శాతం పెంచినట్టి చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్ధులందరికీ విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్య చరణ చేస్తుందని అన్నారు.

Minister Seethakka అంగన్ వాడీలకు మంత్రి సీతక్క శుభవార్త

Minister Seethakka : అంగన్ వాడీలకు మంత్రి సీతక్క శుభవార్త..!

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్ధులు ఉన్న లక్ష్యాలను చేరుకుని మరికొంతమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని సీతక్క అన్నారు. గిరిజన విద్యార్ధులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని అన్నారు. తాను ఏ శాఖలో ఉన్నా తన మనసు గిరిజన సంకేషమం కోసం పరితపిస్తుందని చెప్పారు. తన ప్రాణం ఆదివాసీ, గిరిజనులు, చెంచుల గురించి కొట్టుకుంటుందని అన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన విద్యార్ధూకు సీతక్క ల్యాప్ టాప్స్ అందించారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది