Nagarjuna Sagar : సాగర్‌ లో త్రిముఖ వ్యూహం చాన్సే లేదంట.. పోటీ ఆ రెండు పార్టీల మద్యే అంటున్నారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nagarjuna Sagar : సాగర్‌ లో త్రిముఖ వ్యూహం చాన్సే లేదంట.. పోటీ ఆ రెండు పార్టీల మద్యే అంటున్నారు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి చెందడంతో నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానంకు అనూహ్యంగా ఉప ఎన్నికలు వచ్చాయి. సుదీర్ఘ కాలంగా జైత్ర యాత్ర కొనసాగించిన కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డిని ఓడించి నోముల విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ ఓట్ల మెజారిటీని నోముల పొందారు. అయినా కూడా నోముల అద్బుతమైన విజయాన్ని అందుకున్నారు అంటూ ఆ సమయంలో ఆనపై ప్రశంసల జల్లు కురిసింది. జానా రెడ్డి వంటి సీనియర్‌ ను ఓడించడంతో ఆ పార్టీ […]

 Authored By himanshi | The Telugu News | Updated on :27 February 2021,4:01 pm

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి చెందడంతో నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానంకు అనూహ్యంగా ఉప ఎన్నికలు వచ్చాయి. సుదీర్ఘ కాలంగా జైత్ర యాత్ర కొనసాగించిన కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డిని ఓడించి నోముల విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ ఓట్ల మెజారిటీని నోముల పొందారు. అయినా కూడా నోముల అద్బుతమైన విజయాన్ని అందుకున్నారు అంటూ ఆ సమయంలో ఆనపై ప్రశంసల జల్లు కురిసింది. జానా రెడ్డి వంటి సీనియర్‌ ను ఓడించడంతో ఆ పార్టీ పరిస్థితిని మరింత దారుణ స్థితికి నెట్టడంలో నోముల విజయం కీలకంగా మారింది. అందుకే నోముల విజయాన్ని టీఆర్‌ఎస్ వర్గాల వారు బాగా వాడుకున్నారు. అయితే నోముల మృతితో మళ్లీ ఆ స్థానంకు ఉప ఎన్నిక రావడంతో టీఆర్‌ఎస్ వర్గాల్లో కాస్త టెన్షన్‌ వాతావరణం నెలకొంది. సాగర్ లో జానా రెడ్డి మళ్లీ జెండా పాతాలని భావిస్తున్నాడు.

Nagarjuna Sagar : బీజేపీ వ్యూహాత్మక అడుగులు..

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మరోసారి సాగర్ లో తమ ప్రతాపం చూపించి కేసీఆర్‌ కు చుక్కలు చూపించాలని బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ పరుగులు పెడుతుంది. కాని టీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ మాత్రం అసలు బీజేపీని పోటీగానే చూడటం లేదు. తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనకు ప్రధాన టార్గెట్ కాంగ్రెస్ మాత్రమే, జానా రెడ్డి పై నే ఎక్కువ ఫోకస్‌ పెట్టాలంటూ నాయకులకు దిశా నిర్థేశం చేయడం జరిగింది. ఈ విషయమై టీఆర్‌ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ ను తమ ప్రథమ ప్రధాన ప్రత్యర్థిగా సాగర్‌ లో పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏం చేస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

nagarjuna sagar by elections its only two partys war

nagarjuna sagar by elections its only two partys war

Nagarjuna Sagar : సాగర్‌లో త్రిముఖ పోరు లేదు..

నాగార్జున సాగర్‌ లో త్రిముఖ పోరు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి ఈజీగా టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే అక్కడ త్రిముఖ పోరు లేనే లేదు బీజేపీ అక్కడ కనీసం మూడవ స్థానంలో కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. పోటీ మొత్తం కూడా కాంగ్రెస్ మరియు టీఆర్‌ఎస్ మద్యే ఉంది. కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే సెంటిమెంట్‌ ఏమీ లేదు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా మళ్లీ వెయ్యి రెండు వేల ఓట్ల మెజార్టీ నే ఉంటుందని అంటున్నారు. బీజేపీకి అయిదు నుండి పది వేల ఓట్లు వస్తే గొప్ప విషయం అంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. వచ్చే నెలలో జరుగబోతున్న ఈ ఉప ఎన్నిక విషయమై తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది