nagarjuna sagar by elections : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక.. బీజేపీకి దుబ్బాక, జీహెచ్‌ఎంసీ అంత ఈజీ కాదు
nagarjuna sagar by elections : తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు ప్రజలు అంతా కూడా ఆసక్తి గా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడటంతో ఏర్పడిన నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంకు జరుగబోతున్న ఉప ఎన్నికపై బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. దుబ్బాక మరియు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్ వారికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో జాగ్రత్త పడుతోంది. ముందస్తుగానే బీజేపీ నాయకులకు చెక్ పెట్టే విధంగా టీఆర్‌ఎస్ నాయకులు పావులు కదుపుతున్నారు.
కాస్త లోతుగా ఆలోచిస్తే దుబ్బాక ఉప ఎన్నికకు మరియు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు చాలా తేడా ఉంది అనడంలో సందేహం లేదు. దుబ్బాక లో బీజేపీ అభ్యర్థి పట్ల చాలా సానుకూలత ఉంది. రఘునందన్ సుదీర్ఘ కాలంగా ఓటములతో నియోజక వర్గ ప్రజల సానుభూతిని పొందాడు. ఆయన ప్రచార శైలి మరియు టీఆర్‌ఎస్ అక్కడ చేసిన తప్పిదాల కారణంగా బీజేపీ గెలిచింది అనడంలో సందేహం లేదు. రఘునందన్ ను స్థానికంగా పోలీసు వర్గాల వారు టార్గెట్ చేయడంతో పాటు వరుసగా ఏదో ఒక విషయమై ప్రచారం చేసుకోకుండా అడ్డుకునే వారు. దాంతో ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి కలిగింది అనడంలో సందేహం లేదు.
దుబ్బాకలో జరిగిన తప్పిదాలు నాగార్జున సాగర్ లో జరుగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్ తీవ్రగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో మొదటగా బీజేపీ అభ్యర్థికి ఎలాంటి సానుభూతి వచ్చే పనులు చేయవద్దు. ముఖ్యంగా పోలీసులను ఉపయోగించి బీజేపీ నాయకులను వేదించడం వంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల దాన్ని వారు పబ్లిసిటీగా వాడేసుకుంటున్నారు. తద్వారా ఎక్కువ ఓట్లను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీకి అభ్యర్థి విషయం కూడా నాగార్జున సాగర్ లో కలిసి రాకపోవచ్చు. ఎందుకంటే రఘునందన్ స్థాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ లభించడం కష్టమే. ఇలా బీజేపీకి దుబ్బాకతో పోల్చితే సాగర్ ఉప ఎన్నిక అన్ని విధాలుగా చాలా కష్టం అంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడవ స్థానంలో నిలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.