Peerzadiguda : పీర్జాదిగూడలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
ప్రధానాంశాలు:
Peerzadiguda : పీర్జాదిగూడలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
Peerzadiguda : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో “National Voters’ Day” వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ అమర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ కమిషనర్,అధికారులతో కలిసి ప్రార్థన ప్రతిజ్ఞ నిర్వహించారు…
ఈ సందర్భంగా మేయర్ అమర్ సింగ్ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరాన్ని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కమీషనర్,డిఈ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,మున్సిపల్ సిబ్బంది మరియు స్కూల్ విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
WhatsApp Group
Join Now