Ration Cards : కొత్త రేషన్ కార్డులకి ముహూర్తం ఫిక్స్.. మార్చి 1 నుంచి ఇలా జిల్లాల్లో మొదలు..!
ప్రధానాంశాలు:
Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి ముహూర్తం ఫిక్స్.. మార్చి 1 నుంచి ఇలా జిల్లాల్లో మొదలు..!
Ration Cards : తెలంగాణలో Telangana రేషన్ కార్డులు Ration Cards ఉన్నవారికి శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ శుభవార్త వినిపించింది. లక్ష కొత్త రేషన్ కార్డులను ఒకే రోజున పంపిణీ చేయనుంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. రాష్ట్రంలో 2014 నుంచి కొత్త కార్డులు జారీ చేయలేదు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య చాలా పెరిగింది.

Ration Cards : కొత్త రేషన్ కార్డులకి ముహూర్తం ఫిక్స్.. మార్చి 1 నుంచి ఇలా జిల్లాల్లో మొదలు..!
Ration Cards మార్చి 1 నుంచి ఇలా జిల్లాల్లో మొదలు
గతంలో ప్రజాపాలన, గ్రామ సభల్లో అఫ్లికేషన్లు పెట్టుకోగా, ఇటీవల మీ సేవ Mee seva కేంద్రాల ద్వారా కూడా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తాజాగా రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం నుంచి ముఖ్య అప్డేట్ వచ్చింది. లబ్ధిదారులకు కొత్త కార్డులు పంపిణీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా, మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా డిసైడ్ అయింది.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయాలని డిసైడ్ కాగా, మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం Telanagana భావిస్తుంది. రాష్ట్రంలోని ఉమ్మడి ఏడు(మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ) జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో, ప్రస్తుతానికి ఈ మూడు(హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ) జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీకి సర్కార్ సిద్ధమైంది.