Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం నూతన కమిటీని సన్మానించిన పరమేశ్వర్ రెడ్డి
ప్రధానాంశాలు:
Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం నూతన కమిటీని సన్మానించిన పరమేశ్వర్ రెడ్డి
Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన ఛైర్మెన్ ధర్మ కర్తలు బాధ్యతతో కృషి చేయాలని ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి కోరారు గురువారం ఉప్పల్ నియోజకవర్గ నాచారం మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయం ఎండోమెంట్, ప్రభుత్వ సహకారంతో నూతన చైర్మన్ లను గురువారం గణంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మందముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా దేవాలయ చైర్మన్ గా ఎన్నికైన వారు దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. దేవాలయం అభివృద్ధికి పాటు పడాల్సిన అవసరం పాలక కమిటీకి ఉన్నదని పేర్కొన్నారు .

Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం నూతన కమిటీని సన్మానించిన పరమేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదం లో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు ఆలయాల అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరుకు తాను తోడ్పడుతూ నాచారం ప్రజలు ఆకాంక్షించిన రీతిలో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు రానున్న మహంకాళి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రజల భక్తుల అభీష్టం మేరకు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని కమిటీకి సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్ప పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన పాలన రాష్ట్రంలో జరుగుతుందని పరమేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు…
*ఆలయ చైర్మన్ గా మెతుకు శ్రీనివాస్ రెడ్డి , ధర్మకర్తలు,నెమలికొండ సునీల్ రెడ్డి, టి హెచ్ బాలరాజు, ఈ కృష్ణ యాదవ్, టీ ఉమ,తేనీరు రాకేష్, నర్సింగరావు, శ్రీమంతు గౌడ్, EO వెంకన్న,నాచారం డివిజన్ అధ్యక్షుడు బండారి శ్రీకాంత్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రకాష్ రెడ్డి,కోఆర్డినేటర్ చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నూతల కంటి రాజు, మహేష్ యాదవ్, క్రాంతి కుమార్, లీల , భారతమ్మ, మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు