YS sharmila : ఫోన్ కాల్స్ వస్తున్నాయి పొత్తులపై షర్మిల కీలక వ్యాఖ్యలు..!!
YS sharmila : అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి అన్ని పార్టీల నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని ప్రస్తుతం చార్జింగ్ మోడ్ లో ఉన్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడటం జరిగింది. విలీనం చేయటానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని నేను వస్తానంటే..
ఏ పార్టీ కూడా వద్దు అని చెప్పదని అలాంటప్పుడు పార్టీని విలీనం ఎలా చేస్తానంటూ షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదని 19 మంది ఎమ్మెల్యేలు… గెలిస్తే… ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వం లోపం ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం పార్టీ నుంచి వెళ్లిన వాళ్లని తిరిగి తీసుకొచ్చే సత్తా ఉందా అని ఆమె ప్రశ్నించారు. విలీనం చేయాలనుకుంటే పార్టీ పెట్టి మూడువేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సిన అవసరమే.. వచ్చేది కాదు.
విలీనం చేయాలనుకుంటే ఎప్పుడో అది జరిగేది ఇప్పుడు అవసరం లేదని షర్మిల వ్యాఖ్యానించారు. జాతీయ సమస్త చేసిన సర్వేలో తెలంగాణలో 43 నియోజకవర్గాల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రభావం చూపుతోందని రిపోర్టులో ఫలితాలు వచ్చాయి. అలాంటప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ తమదేనని వ్యాఖ్యానించారు.
