Congress : ‘పవర్’ లెస్ కాంగ్రెస్.. కరెంట్ కోతలు మొదలు..!
ప్రధానాంశాలు:
Congress : 'పవర్' లెస్ కాంగ్రెస్.. కరెంట్ కోతలు మొదలు..!
Congress : కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో కరెంటు ఉండదని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. అయితే ఓటర్లు ఇప్పుడున్న కరెంట్ తర్వాత ఎందుకు ఉండదని పెద్దగా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ కరెంటు ఎలా ఇచ్చింది అనేది ఓటర్లకు అనవసరం. కొనుగోలు చేసిందా ఉత్పత్తి చేసిందా అనే సంగతి తర్వాత. ప్రజలకు కరెంట్ అందిందా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ కాలేదు. కానీ కాంగ్రెస్ పదవి చేపట్టిన నెల రోజుల్లో హైదరాబాదులో ప్రతిరోజు రెండు గంటల కరెంట్ కట్ అని ప్రకటించింది. కారణం ఏది చెప్పినా ప్రజలు పవర్ కట్ గానే భావిస్తారు. ఈ క్రమంలోనే కరెంటు చార్జీలు కూడా పెంచబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. వార్షిక నిర్వహణ, మరమ్మత్తు పనుల్లో భాగంగా కోతలను అమలు చేస్తున్నామని ఫిబ్రవరి 10 వరకు పవర్ కట్ ఉంటుందని ప్రకటించారు.
గతంలో కరెంటు మరమ్మత్తుల కోసం ఎప్పుడు తీయలేదు. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పవర్ హాలిడేలు ప్రకటించేవారు. తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం తక్కువ. తెలంగాణ ఏర్పడితే చీకట్లోకి వెళుతుందని కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు కరెంటు సమస్యను ఎదుర్కోలేదు. ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలను కేసీఆర్ అందించారు. అప్పటికప్పుడు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోలేం కాబట్టి ఉత్పత్తిని కొనుగోలు చేశారు. భవిష్యత్తు నిర్మాణాల కోసం ప్లాంట్ల నిర్మాణం చేపట్టారు.
విద్యుత్ సంస్థల పేరుతో అప్పులు చేశారని కాంగ్రెస్ విమర్శలు చేసినా ప్రజలకు ముందుగా కరెంట్ ఇస్తే తప్ప ఇవేమీ ఎక్కవు. కరెంటు కోతలు విధించి గత ప్రభుత్వం తప్పుల వల్లే అంటే చేతకానితనం అని ప్రజలు నమ్ముతారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ విద్యుత్ చార్జీలను ప్రజలపై అంతగా వేయలేదు. పొరుగు రాష్ట్రాలలో కరెంటు కోతలు పెరిగి విద్యుత్ ఛార్జీలు పెరిగిన కేసీఆర్ పెంచలేదు. ఇప్పుడు కరెంట్ కట్ అయిన ప్రతిసారి కేసీఆర్ మాటలే గుర్తొస్తున్నాయి. కరెంటు కోతలకు కారణాలు చెప్పకుండా కోతలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఉంది. కేసీఆర్ హయాంలో కాలనీలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వాహణ కోసం కరెంటు బంద్ చేసేవారు. కానీ ఇలా మీడియాకు ప్రచారం చేసి కరెంటు కోతలు అని చెప్పలేదు. రేవంత్ సర్కార్ కు కరెంటు కోతలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.