Bhatti Vikramarka : పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, భట్టి పాదయాత్రను మెచ్చుకున్న రాహుల్ గాంధీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bhatti Vikramarka : పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, భట్టి పాదయాత్రను మెచ్చుకున్న రాహుల్ గాంధీ..!

Bhatti Vikramarka : తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి!తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 June 2023,3:00 pm
Bhatti Vikramarka : తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి!తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్ షూసు… ఈ రూపం ఎక్కడ కనిపించిన మనకు పెద్దాయనే గుర్తుకు వస్తారు. అటువంటి సందర్భమే మరోసారి వచ్చింది తెలంగాణ నేలపై.
Rahul gandhi focus on Bhatti Vikramarka Padayatra

Rahul gandhi focus on Bhatti Vikramarka Padayatra

అప్పుడు చంద్రబాబు లాగే ఇప్పుడు కేసీఆర్ అరాచక పాలన సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న తెలంగాణ ప్రజానీకానికి తొమ్మిదేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి. వారి చెమర్చిన కళ్లు తుడవటానికే మనందరి జన నేత భట్టి విక్రమార్క పట్టుబట్టి బయలుదేరారు. వేయి కిలో మీటర్లు దాటి వంద రోజుల మైలు రాయిని త్వరలో చేరుకోబోతున్నారు! ఆనాటి రాజశేఖర్ రెడ్డి లాగే ఇంటి నుంచీ బయలుదేరి నిర్విరామంగా జనం మధ్య గడుపుతోన్న భట్టికి జూన్ 15న ఆయన బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాల్ వచ్చింది! అది మరెవరి నుంచో కాదు… ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియమ్మ తనయుడు దిల్లీ నుంచీ ఫోన్ చేశారు! భట్టికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు.
Rahul gandhi focus on Bhatti Vikramarka Padayatra

Rahul gandhi focus on Bhatti Vikramarka Padayatra

గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చగా మారిన పీపుల్స్ మార్చ్… రాహుల్ ను కూడా ఆకర్షించింది. జనం కోసం జన నేత భ్టటి విక్రమార్క చేస్తోన్న పోరాటం ఆయన చేత ఫోన్ చేయించింది. తెలంగాణలో సామాన్య జనం బాగోగుల గురించి ఆరా తీయించింది! ప్రజల కోసం ఆరాటపడుతోన్న నాయకుడికి అండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుందని ఆయన అన్నట్లు సమాచారం. మొత్తంగా భట్టి పాదయాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది! రాహుల్ నుంచీ ఫోన్ రావటంతో భట్టి విక్రమార్క మరింత ధృఢ సంకల్పంతో ఇక పై ముందుకు దూసుకుపోనున్నారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది