Juttukonda Satyanarayana : రాయినిగూడెం సహకార సంఘం చైర్మన్ గా జుట్టుకొండ సత్యనారాయణ..!
ప్రధానాంశాలు:
Juttukonda Satyanarayana : రాయినిగూడెం సహకార సంఘం చైర్మన్ గా జుట్టుకొండ సత్యనారాయణ..!
Juttukonda Satyanarayana : నెగ్గిన అవిశ్వాస తీర్మానం నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం… గరిడేపల్లి ముచ్చట ప్రతినిధి కొండ సైదులు గౌడ్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయని గూడెం పిఏ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన జుట్టుకొండ సత్యనారాయణ ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 2వ తారీఖున టిఆర్ఎస్ కు చెందిన మాజీ ఏసిఎస్ చైర్మన్ ముప్పారాపు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఓటింగ్ నిర్వహించి చైర్మన్ పై అవిశ్వాస ఫలితాన్ని వెల్లడించవద్దని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో ఆరోజు అవిశ్వాస ఫలితాలని అధికారంగా వెల్లడించలేదు.
అయితే ఫిబ్రవరి 27న ముప్పారపు రామయ్య వేసిన పిటీషన్ విచారించి, రామయ్య వేసిన పిటీషన్ కొట్టివేస్తూ.. హైకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో శనివారం ఎన్నిక నిర్వహించగా.. జుట్టు కొండ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొమ్మిది మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాక సత్యనారాయణ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డి సి ఓ పద్మ ప్రకటించడం జరిగింది.

Juttukonda Satyanarayana : రాయినిగూడెం సహకార సంఘం చైర్మన్ గా జుట్టుకొండ సత్యనారాయణ..!
అనంతరం ఆయనకు ఎన్నికైనట్లు పత్రాన్ని ఆమె అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో పిఎసిఎస్ అభివృద్ధి చేస్తానని గత బిఆర్ఎస్ చైర్మన్ నాయకులు పిఎసిఎస్ ను బ్రష్టు పట్టిస్తున్నారు. తన ఎన్నికలకు సహకరించిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి నాయకులకు డైరెక్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు…