Home » News » Rajiv Yuva Vikasam Scheme Loan Is Only Available To Those Who Have Invested Less Than Rs 1 Lakh In Advance
News

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకం ముందుగా వారికే రుణాలు.. ఆ తర్వాతే వీరికి

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 31, 2025 4:19 pm
Advertisement

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థికంగా తోడ్పాటు కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఆశాజనకంగా మారింది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రూ. 50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. మార్చి 15, 2025న అధికారికంగా ప్రారంభమైన ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్ల నిధులను కేటాయించింది. ఇప్పటికే దాదాపు 16 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకం ముందుగా వారికే రుణాలు.. ఆ తర్వాతే వీరికి

Rajiv Yuva Vikasam Scheme : ముందుగా లక్ష లోపు పెట్టుకున్న వారికే రాజీవ్ యువ వికాసం పథకం రుణం

పథకానికి అర్హులైన వారికి జూన్ 2న తొలి విడతగా లక్ష మంది లబ్ధిదారులకు రూ.50 వేలు మరియు లక్ష రూపాయల లోపు యూనిట్లకు ప్రాసీడింగ్స్ అందించనున్నారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా, జూన్ 10 నుంచి 15 వరకు శిక్షణ కార్యక్రమాలు చేపడతారు. అనంతరం జూన్ 16న యూనిట్ల ప్రారంభోత్సవం జరగనుంది. త్వరలోనే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు కూడా నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది యువతకు స్వంతంగా వ్యాపారం మొదలుపెట్టేందుకు గొప్ప అవకాశంగా మారుతుంది.

Advertisement

ఈ పథకానికి అర్హులవడానికి వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే కుటుంబం బీపీఎల్ (BPL) జాబితాలో ఉండాలి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే అర్హత కల్పించనున్నారు. పథకంపై వచ్చిన కొన్ని ఆరోపణల మేరకు సిబిల్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం దరఖాస్తుల్లో 80 శాతం దాకా యువత రూ.4 లక్షల రుణం కోరుతూ అప్లై చేసినట్టు సమాచారం. ఈ పథకం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి