RGV
Nomula Bharath : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై కూడా తనదైన శైలిలో ఒక ట్విట్ చేసి అందరిని అలర్ట్ చేశాడనే చెప్పాలి. నోముల నరసింహయ్య చనిపోవటంతో సాగర్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస తరుపున నోముల భగత్ కే పార్టీ టిక్కెట్ ఇచ్చాడు కేసీఆర్.
దీనితో ఉప పోరు ఆసక్తిగా మారిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకొని వెళ్తున్న తరుణంలో, వర్మ తన మార్క్ చూపిస్తూ నోముల భగత్ కు చెందిన ఒక వీడియో ట్విట్ చేయటం ఇప్పుడు వైరల్ అయ్యింది. నోముల భగత్… ఓ చిరుత పులితో వాకింగ్ చేస్తూ వెళ్తున్న చిన్న వీడియోను వర్మ (RGV) ట్వీట్ చేశారు. అంతే… ఇక దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ట్వీట్ వీడియోని ఇప్పటికే 50వేల మంది దాకా చూడగా… 2400 మందికి పైగా లైక్ చేశారు.
“వామ్మో… కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్, సింహాలు అని మనకు తెలుసు. కానీ, అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని’’ అని వర్మ ట్వీట్ చేశారు. అంటూ ఒక ట్వీట్ ‘‘ఈ అభ్యర్థి నోముల భగత్… “మాకు ఓటు వేయండి. నాగార్జునసాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలబడలేదు” అంటున్నారు. చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’’ అని మరో ట్వీట్ చేశారు.
ఈ వీడియో చూస్తే అది ఖచ్చితంగా ఇండియాలో కాదని నెటిజన్లు చెపుతున్నారు, ఎందుకంటే ఇండియా లో అలా చేయటం కుదరదు, కానీ ఆ వీడియో లోని లొకేషన్ ను చూస్తే , అది ఆఫ్రికా లోని సహారా ఎడారి కావచ్చు అని అంటున్నారు.. అక్కడి సఫారీల్లో ఇలా చిరుతలతో ప్రజలు దగ్గరగా ఉండేలా వాటికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు కాబట్టే… ఇది అక్కడిదే అంటున్నారు కొందరు.
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
This website uses cookies.