Sagar by poll : సాగర్ ఎన్నికల నేపథ్యంలో వర్మ వైరల్ ట్విట్.. చిరుతతో భగత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sagar by poll : సాగర్ ఎన్నికల నేపథ్యంలో వర్మ వైరల్ ట్విట్.. చిరుతతో భగత్

 Authored By brahma | The Telugu News | Updated on :3 April 2021,12:50 pm

Nomula Bharath : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై కూడా తనదైన శైలిలో ఒక ట్విట్ చేసి అందరిని అలర్ట్ చేశాడనే చెప్పాలి. నోముల నరసింహయ్య చనిపోవటంతో సాగర్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస తరుపున నోముల భగత్ కే పార్టీ టిక్కెట్ ఇచ్చాడు కేసీఆర్.

Nomulaa Bhagat

దీనితో ఉప పోరు ఆసక్తిగా మారిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకొని వెళ్తున్న తరుణంలో, వర్మ తన మార్క్ చూపిస్తూ నోముల భగత్ కు చెందిన ఒక వీడియో ట్విట్ చేయటం ఇప్పుడు వైరల్ అయ్యింది. నోముల భగత్… ఓ చిరుత పులితో వాకింగ్ చేస్తూ వెళ్తున్న చిన్న వీడియోను వర్మ (RGV) ట్వీట్ చేశారు. అంతే… ఇక దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ట్వీట్‌ వీడియోని ఇప్పటికే 50వేల మంది దాకా చూడగా… 2400 మందికి పైగా లైక్ చేశారు.

Nomula Bharath : నోముల భగత్ చిరుత పులితో వాకింగ్‌..

“వామ్మో… కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్‌, సింహాలు అని మనకు తెలుసు. కానీ, అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్‌ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని’’ అని వర్మ ట్వీట్ చేశారు. అంటూ ఒక ట్వీట్ ‘‘ఈ అభ్యర్థి నోముల భగత్… “మాకు ఓటు వేయండి. నాగార్జునసాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలబడలేదు” అంటున్నారు. చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’’ అని మరో ట్వీట్ చేశారు.

ఈ వీడియో చూస్తే అది ఖచ్చితంగా ఇండియాలో కాదని నెటిజన్లు చెపుతున్నారు, ఎందుకంటే ఇండియా లో అలా చేయటం కుదరదు, కానీ ఆ వీడియో లోని లొకేషన్ ను చూస్తే , అది ఆఫ్రికా లోని సహారా ఎడారి కావచ్చు అని అంటున్నారు.. అక్కడి సఫారీల్లో ఇలా చిరుతలతో ప్రజలు దగ్గరగా ఉండేలా వాటికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు కాబట్టే… ఇది అక్కడిదే అంటున్నారు కొందరు.

 

 

 

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది