Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేష‌న్లు క‌ల్సించాలి… గిద్దె రాజేష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేష‌న్లు క‌ల్సించాలి… గిద్దె రాజేష్

 Authored By ramu | The Telugu News | Updated on :18 February 2025,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేష‌న్లు క‌ల్సించాలి... గిద్దె రాజేష్

Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో Panchayat Elections వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే పరిగి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభిస్తామని వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో నిర్వహించిన భారత హక్కుల పరిరక్షణ పరిగి మండల రాజ్యాధికార సాధన సభలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి కాంగ్రెస్ పార్టీ AICC ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాజస్థాన్ చతిస్గడ్ తరహాలోనే తెలంగాణలోనూ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తమ పోరాటం ఆగబోదని స్వష్టీకరణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే పరిగి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో సంఘం సంఘం మండల అధ్యక్షులు పసుల చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పరిగి మండల రాజ్యాధికార సాధన సభకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ .

Panchayat Elections పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేష‌న్లు క‌ల్సించాలి గిద్దె రాజేష్

Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేష‌న్లు క‌ల్సించాలి… గిద్దె రాజేష్

తెలంగాణ Telangana అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల 6000 పెన్షన్ పెంచడంతోపాటు ఆర్టీసీలో వికలాంగులకు 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేస్తామని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో మునుం పెట్టి మరి వికలాంగులకు హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 14 నెలల పాలనలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడమే అడుగడుగున వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తూ వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోను పరిశ్రమల రంగంలో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన MSME పాలసీల్లో వికలాంగులకు రిజర్వేషన్ లేకుండా చేసిందని ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన .

Panchayat Elections సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల్లో విక‌లాంగుల‌కు ఇచ్చిన హామీలు నేర‌వేర్చాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన ఉచిత ప్రయాణ హామీని నేటి వరకు నెరవేర్చలేదని అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తెలంగాణలో వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలును గాలికి వదిలేసిందని ఆఖరికి డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే వికలాంగులు క్రీడలకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు 70 వేలు కేటాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 70 లను 50 వేలకు గురించి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించారని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ AICC 2024 మేనిఫెస్టోలో పేజి నెంబర్ 9 ఐటెం నెంబర్ 8లో గతంలో తమ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలైన రాజస్థాన్ చతిస్గడ్ ల తరహాలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కుట్రలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో చట్టం చేసి.

కేంద్రానికి పంపుతామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ప్రకటనను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి స్వాగతిస్తుందని బీసీలతో పాటే తెలంగాణలో పైసా ఖర్చు లేకుండా తెలంగాణలో ఉన్న 12769 గ్రామ పంచాయితీల్లో 25 వేల 538 మంది వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించి AICC వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సంఘం పరిగి మండల అధ్యక్షులు పసుల చంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశీష్ట అతిథి పాల్గొన్న వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుదీర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ సాధన కోసం తమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో ఎంతటి పోరాటానికైనా శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు సంఘం పరిగి మండల అధ్యక్షులు పసుల చంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ సంఘం పరిగి నియోజకవర్గ ఇంచార్జ్ ఇప్పటూరి లక్ష్మయ్య దోమ మండల అధ్యక్షులు చుక్కయ్య సంఘం యువజన విభాగం నాయకులు సిద్దు పరిగి మండల ఉపాధ్యక్షులు నారాయణ తదితరులు పాల్గొన్నారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది