Farmers Loan Waive : ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ…తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త..!
Farmers Loan Waive : తెలంగాణ రైతు సోదరులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ఆసక్తికరమైన వార్తను అందించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ కూడా ఒకటి.ఈ నేపథ్యంలోనే కోట్ల రూపాయలను రుణమాఫీ చేసేందుకు సమగ్ర విధి విధానాలను రూపొందిస్తున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కో రైతుకు ఒక్కో సందర్భంలో రూ.2 లక్షలు రుణమాఫీ ఇవ్వనున్నారు. ఇక ఈ విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులతో కొనసాగుతున్న సహకారం గురించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైతు రుణమాఫీ కార్యక్రమం తెలంగాణ రైతు సోదరులకు మరింత భరోసాని అందిస్తోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక వాగ్దానమైన రుణమాఫీని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించి ప్రత్యేక విధానాలు , మార్గదర్శకాలకు ప్రభుత్వం చురుగ్గా కార్యచరణ చేస్తుందని ఈ క్రమంలోనే ఒక్కో రైతుకు 2 లక్షల రుణమాఫీ తెలంగాణలోని ప్రతి వ్యవసాయ వర్గాలకు ఆశాజ్యోతి గా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు.
Farmers Loan Waive : రుణమాఫీ విది విధానాలు రూపకల్పన : మంత్రి తుమ్మల
వ్యవసాయ ప్రగతికి కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు కట్టుబడే ఉంటుందని మంత్రి తుమ్మల ఉద్ఘాటించారు. అయితే గత ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక పరిస్థితులు సవాల్లతో కూడుకున్నప్పటికీ రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం రుణమాఫీ ఇవ్వడానికి దృఢంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు.ఈ నేపథ్యంలోనే రుణమాఫీకి కోటి రూపాయలకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన కొనసాగుతుందని తుమ్మల ప్రకటించారు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో 2 లక్షల రుణమాఫీ ఉంటుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు నియమాలకు కట్టుబడి ఉండడం వలన ల ఎన్నికల తర్వాత ఈ చొరవకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తామని తెలియజేశారు.
అలాగే రుణమాఫీ కార్యక్రమం తో పాటు రైతుబంధు నిధుల పంపిణీ పై కూడా గణనీయమైన పురోగతి ఉంటుందని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. గణనీయమైన సంఖ్యలో రైతులు ఇప్పటికే యాసంగి సీజన్ కు సంబంధించిన రైతుబంధు నిధులు పొందారని , కేటాయించిన నిధులలో 92.68 శాతానికి పైగా రైతుల బ్యాంకులో జమ చేయబడ్డాయని చెప్పుకొచ్చారు. ఇది గత ప్రభుత్వ పరిపాలనతో పోలిస్తే గణనీయమైన అభివృద్ధి అని సూచించారు. ఇది అర్థవంతమైన ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఉద్దేశించి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమం విషయంలో రాజకీయ అవకాశవాదం ఉందని విమర్శించారు. ఈ తరుణంలోనే గత వాగ్దానాలు మరియు చర్యల మధ్య అసమానతల గురించి ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా రైతుబంధు నిధులు ఆలస్యం , రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవహారం , కరువు పరిస్థితులు వంటి వాటిపై వాస్తవమైన ఆందోళనలను రాజకీయం చేసే ప్రయత్నాలను ఆయన కొట్టివేశారు. ఇక కార్యక్రమం ముగింపులో ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ కచ్చితంగా రైతులకు చేరుతుందని వ్యవసాయ సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పుకొచ్చారు.