Revanth Reddy : ఉప్ప‌ల్ రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్త‌త‌.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : ఉప్ప‌ల్ రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్త‌త‌.. వీడియో

Revanth Reddy : నేడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం కాబోతున్నారు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద భారీగా జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రేగ లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చింపివేయడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఫ్లెక్సీ లు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా […]

 Authored By sekhar | The Telugu News | Updated on :29 July 2023,1:35 pm

Revanth Reddy : నేడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం కాబోతున్నారు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద భారీగా జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రేగ లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చింపివేయడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

ఈ సమయంలో ఫ్లెక్సీ లు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా రిపోర్టర్లపై పరమేశ్వర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. వెంటపడి మీడియా ప్రతినిధులపై పోలీసుల ముందే దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో దాడిని ఆపాలని ప్రయత్నించిన కొంతమంది పోలీసులు కింద పడిపోవడం జరిగింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు తమ బలం చూపించుకునే ప్రయత్నంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడటంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

revanth reddy congress leaders attacked the media reporters

revanth reddy congress leaders attacked the media reporters

మీడియా ప్రతినిధులపై కాంగ్రెస్ కార్యకర్తలు చేయి చేసుకోవడంతో రేవంత్ రెడ్డి మేడ్చల్ కార్యక్రమాన్ని మీడియా ప్రతినిధులు బాయ్ కట్ చేశారు. చాలా దారుణంగా అత్యంత కిరాతకంగా.. మీడియా ప్రతినిధులను నడిరోడ్డుపై పరిగెత్తించి మరి కొట్టారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మీడియా ప్రతినిధులపై.. కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది