Revanth Reddy : ఉద్యోగ నియామకాల పై రేవంత్ సంచలన నిర్ణయం
ప్రధానాంశాలు:
Revanth Reddy : ఉద్యోగ నియామకాల పై రేవంత్ సంచలన నిర్ణయం
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే జీవో ద్వారా మొత్తం 6,729 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొనసాగుతున్న వీరి విధులను అర్థం చేసుకుని, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో హైదారాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ గోపాల్ కిషన్ రావు, ట్రాన్స్‌కో-జెన్‌కో డైరెక్టర్లు వంటి కీలక వ్యక్తులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు.

Revanth Reddy : ఉద్యోగ నియామకాల పై రేవంత్ సంచలన నిర్ణయం
Revanth Reddy పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ షాక్
ఈ నిర్ణయం వివిధ శాఖల్లో కీలక మార్పులకు దారితీస్తోంది. మున్సిపల్ శాఖలో 177 మంది, ఇరిగేషన్ శాఖలో 200 మందికి పైగా అలాగే రెవెన్యూ, విద్య, రవాణా, దేవాదాయ, పోలీస్ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు పడింది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఫోన్ ట్యాపింగ్ వివాదం తర్వాత కొందరిని తొలగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా నిర్ణయం ద్వారా ప్రభుత్వం గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు నోటిఫికేషన్లు జారీ చేసి, కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని యోచిస్తోంది. దీని వల్ల యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశించే అవకాశాలు పెరుగుతాయని అంచనా.
ఇక ఈ నిర్ణయం ఉద్యోగులకు పదోన్నతులకు కూడా మార్గం సుగమం చేస్తోంది. ప్రస్తుత ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు లభించనున్నాయి. అయితే తొలగించబడిన వారిలో ప్రభుత్వం అవసరంగా భావించిన కొందరిని తిరిగి నియమించుకునే అవకాశం ఉంది. మెట్రో రైల్‌ను పర్యవేక్షిస్తున్న ఎన్‌వీఎస్ రెడ్డికి మళ్లీ అవకాశం దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగ నియామకాలలో సమతుల్యత ఎలా సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అనుభవజ్ఞుల తొలగింపు, మరోవైపు కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా ఉండబోతుందనేది తెలంగాణ రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.