Revanth Reddy : KTR వి అన్ని పోరంబోకు మాటలు… మందు కల్లు తాగినోడు మాట్లాడినట్లు మాట్లాడుతుండు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : KTR వి అన్ని పోరంబోకు మాటలు… మందు కల్లు తాగినోడు మాట్లాడినట్లు మాట్లాడుతుండు

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు రకాల ఆరోపణ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తండ్రి కొడుకులు గురించి మాట్లాడుతూ […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : KTR వి అన్ని పోరంబోకు మాటలు... మందు కల్లు తాగినోడు మాట్లాడినట్లు మాట్లాడుతుండు

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు రకాల ఆరోపణ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తండ్రి కొడుకులు గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….

కేటీఆర్ మాట్లాడే మాటలు అన్ని పోరంబోకు మాటలు. ఊర్లలో ఆవారా పోరగాళ్లు మందు కల్లు తాగిన తర్వాత ఇలాగే మాట్లాడుతా ఉంటారు. మా కొడంగల్ నారాయణపురం ఏరియాలో మందుకల్లు ఎక్కువ. మందు కల్లు తాగిన తర్వాత ఇలాగే , మాట్లాడతా ఉంటారు. ఇక కేసీఆర్ ను చూస్తుంటే నాకు సేమ్ మందు కల్లు తాగిన వాడిలాగే కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ కి 40 సీట్లు వస్తున్నాయి అంటే బీజేపీ కి 400 సీట్లు వస్తున్నట్లు ఒప్పుకున్నట్టే కదా.

మరి కేసీఆర్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే మోడీ వీడు ఒకటి రా నాయనా మోడీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ వేసినట్లే , బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాబట్టి వారి మాటల వెనకాల ఉన్న మర్మం మీరు ఆలోచన చేయండి అంట రేవంత్ రెడ్డి తెలియజేశారు. వాళ్లంతా కాంగ్రెస్ కి 40 సీట్లు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ బాసు నరేంద్ర మోడీ గెలవాలని. వాళ్లు మోడీ కాళ్లు పట్టుకొని ఈ విధంగా వ్యవహరిస్తూ వారు మోడీకి జేజేలు కొడుతున్నారు. వారా మా గురించి మాట్లాడేది అంటూ రేవంత్ రెడ్డి ఏదేవా చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది