Revanth Reddy : 8 నెలల పాలనలో కాంగ్రెస్ కు సూపర్ రేటింగ్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 19 August 2024, 5:00 pm
  •  Revanth Reddy : 8 నెలల పాలనలో కాంగ్రెస్ కు సూపర్ రేటింగ్..!

Revanth Reddy : తెలంగాణా రాష్ట్రం ఇచ్చి జనం కలని నిజం చేసిన కాంగ్రెస్ పదేళ్ల తర్వాత ప్రజలు అధికారం ఇచ్చారు. ఎన్నో అంచనాల మధ్య అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ గడిచిన 8 నెలల పరిపాలనలో ప్రజా విశ్వాసం ఏర్పరచుకుందా లేదా అన్న చర్చ ఉంది. ఐతే తాజాగా ఒక సర్వే ప్రకారం కాంగ్రెస్ టాప్ ర్యాంక్ లో నిలిచింది. రేవంత్ సర్కారు కి అదిరిపోయే రేటింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ఎన్నికల టైం లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ పరిపాలనను ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కాంగ్రెస్ కి ప్రజల మద్ధతు ప్రకటించారు. ఇక సంక్షేమ పథకాలు కూడ కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి పనితీరు 72 శాతం మంది తెలంగాణా వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పై పల్స్ ఆఫ్ పీపుల్ అనే సర్వే వెల్లడించిన రేటింగ్ ప్రకారం కాంగ్రెస్ రేటింగ్ అదిరిపోయింది.

Revanth Reddy సర్వేలతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం..

ఈ రేటింగ్ తో కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. 8 నెలల వ్యవధిలోనే తెలంగాణా ప్రజల అంచనాలను అందుకోవడం గొప్ప విషయం. ఐతే ఎన్నికల టైం లో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు చిత్తశుద్ధితో నెరవేర్చిందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని అగ్ని న్యూస్ సర్వీస్ ఇచ్చిన రీసెంట్ సర్వేలో వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణాలో కాంగ్రెస్ పాలన భేష్ అనేలా ప్రజల స్పందన ఉందని తెలుస్తుంది.

Revanth Reddy : 8 నెలల పాలనలో కాంగ్రెస్ కు సూపర్ రేటింగ్..!

Revanth Reddy : 8 నెలల పాలనలో కాంగ్రెస్ కు సూపర్ రేటింగ్..!

రేవంత్ రెడ్డి నాయకత్వానికి కాంగ్రెస్ అధిష్టానం దిశా నిర్దేశానికి పడిన మార్కులు గా ఈ సర్వే ఫలితాలు బాగున్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణా డాక్ట్ర్ కోట నీలిమ స్పందిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా ఉత్తమపాలన అందిస్తుందని అన్నారు. హైదరాబాద్ ని అందరు గర్వించే విధంగా ప్రపంచస్థయి నగరంగా తీర్చిదిద్దుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు మార్గ దర్శకత్వానికి లభించిన ప్రంశగా చెప్పొచ్చు. తెలంగాణా ప్రదేశ్ కాగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ కూడా ప్రభుత్వానికి ఎంతో పాజిటివ్ గా సర్వేలు ఉన్నాయని అన్నారు. అంతేకాదు అనేక హామీలు తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన అన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి