Sobhita Dhulipala : అక్కినేని కొత్త కొడ‌లికి ఇది ఛాలెంజే… అమ‌ల స్థానాన్ని నిల‌బెట్ట‌గ‌ల‌దా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sobhita Dhulipala : అక్కినేని కొత్త కొడ‌లికి ఇది ఛాలెంజే… అమ‌ల స్థానాన్ని నిల‌బెట్ట‌గ‌ల‌దా ?

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Sobhita Dhulipala : అక్కినేని కొత్త కొడ‌లికి ఇది ఛాలెంజే... అమ‌ల స్థానాన్ని నిల‌బెట్ట‌గ‌ల‌దా ?

Sobhita Dhulipala : టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైత‌న్య కొన్నేళ్ల క్రితం స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. కొన్నేళ్ల‌పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఊహించ‌ని విధంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల త‌ర్వాత కొన్నాళ్ల‌పాటు సింగిల్‌గా ఉన్న నాగ చైతన్య ఆగ‌స్ట్ 8న శోభిత‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. వీరి నిశ్చితార్థం జరిగి వారం రోజులు అవుతున్నా జనాలు మాత్రం వీరిద్దరి నిశ్చితార్థం గురించి, వీరిద్దరి లవ్ గురించే పెద్దఎత్తున చర్చ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పటి నుంచి మొదలైంది? వీరిద్దరూ ఎప్పటినుంచి కలుసుకుంటున్నారు? నాగచైతన్యతో సమంత కలిసి ఉన్న రోజుల్లోనే వీరి మధ్యలో ఎఫైర్ నడిచిందా? ఇట్లాంటి అనేక రకాల ప్రశ్నలు నెటిజెన్లకు నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ తో ఉత్పన్నమవుతున్నాయి.

Sobhita Dhulipala శోభిత ఏం చేస్తుంది..

మ‌రోవైపు శోభితను నాగార్జున భార్య అమల తో పోలుస్తున్నారు. అమల కి ఉన్నంత బాధ్యత శోభితకి ఉంటుందా? అక్కినేని కుటుంబంలోకి రాబోతున్న శోభిత ఫ్యామిలీ కోసం అమల మాదిరి కెరీర్ త్యాగం చేస్తుందా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. 1992లో అక్కినేని నాగార్జున హీరోయిన్ అమలను రెండో వివాహం చేసుకోగా, ఆమె త‌న కుటుంబం కోసం కెరీర్ ని పక్కన పెట్టింది.పెళ్ళైన ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెలెక్టీవ్ గా తల్లి పాత్రలు, గెస్ట్ రోల్స్ చేస్తుంది. నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆమె కూడా నటనకు గుడ్ బై చెబుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. నాగ చైతన్య మాజీ భార్య సమంతకు అక్కినేని ఫ్యామిలీ కెరీర్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది.

Sobhita Dhulipala అక్కినేని కొత్త కొడ‌లికి ఇది ఛాలెంజే అమ‌ల స్థానాన్ని నిల‌బెట్ట‌గ‌ల‌దా

Sobhita Dhulipala : అక్కినేని కొత్త కొడ‌లికి ఇది ఛాలెంజే… అమ‌ల స్థానాన్ని నిల‌బెట్ట‌గ‌ల‌దా ?

నాగ చైతన్య కూడా ఆమెను ప్రోత్సహించాడు. సమంత వివాహం అనంతరం కూడా బోల్డ్ రోల్స్ చేసింది. నాగ చైతన్యతో విభేదాలకు అది కూడా కారణం అంటారు. ఒకవేళ శోభిత నటన కొనసాగిస్తే నాగ చైతన్య-శోభిత బంధం ఒడిదుడుకులు లేకుండా సాగుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి . ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మ‌రి శోభిత బోల్డ్ రోల్స్ లో న‌టిస్తుందా, లేదంటే కొన్నాళ్ల‌పాటు త‌న కెరీర్‌కి బ్రేక్ ఇచ్చి ఆ త‌ర్వాత కూల్ అండ్ కామ్ రోల్స్ చేసుకుంటూ వెళుతుందా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది