Revanth Reddy Govt : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్..!
ప్రధానాంశాలు:
Revanth Reddy Govt : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్..!
Revanth Reddy Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14,236 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు ఉన్నాయి. స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గతంలో పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయగా, ఈసారి విద్యార్హతను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచారు. 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు మాత్రమే అర్హులు. ముఖ్యంగా అభ్యర్థులు స్థానిక అంగన్వాడీ పరిధిలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి.

Revanth Reddy Govt : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్..!
Revanth Reddy Govt : అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష .. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ ప్రయోజనాలు పెంచుతూ మరో నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటికే జీతాలు పెంచడం, మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం వంటి నిర్ణయాలతో అంగన్వాడీ ఉద్యోగులకు వరుసగా మంచి వార్తలు అందుతున్నాయి.
తెలంగాణ లో ప్రస్తుతం 35,000కు పైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అయితే కొన్నిచోట్ల టీచర్లు లేకపోవడం, మరికొన్నిచోట్ల హెల్పర్లు లేని పరిస్థితి ఉన్నందున సేవలలో అంతరాయం కలుగుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇంటర్మీడియట్ అర్హత, సొంత ప్రాంతంలోనే ఉద్యోగం, బాగున్న జీతం – ఇవన్నీ ఈ ఉద్యోగాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీచర్లకు నెలకు రూ.12,500 నుంచి రూ.13,500 వరకు, హెల్పర్లకు రూ.8,000 జీతం అందిస్తున్నారు. మహిళలు స్థానికంగానే పని చేయగల అవకాశంతో ఈ ఉద్యోగాల డిమాండ్ అధికంగా ఉంది.