Revanth Reddy : రేవంత్ రెడ్డి టీంలోకి కొత్త మంత్రులు.. వీహెచ్‌కి ఆ ప‌ద‌వి ద‌క్క‌నుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : రేవంత్ రెడ్డి టీంలోకి కొత్త మంత్రులు.. వీహెచ్‌కి ఆ ప‌ద‌వి ద‌క్క‌నుందా?

Revanth Reddy : తెలంగాణ‌లో కొత్త‌గా వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్ని ప‌నులు చ‌కా చ‌కా చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 August 2024,8:00 pm

Revanth Reddy : తెలంగాణ‌లో కొత్త‌గా వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్ని ప‌నులు చ‌కా చ‌కా చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో నూతన పీసీసీ చీఫ్..మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్ పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు కొత్తగా రేవంత్ టీంలోకి ఆరుగురు రానున్నారు.

Revanth Reddy ఎవ‌రా ఆరుగురు..!

నలుగురిని మాత్రమే ప్రస్తుతానికి ఎంపిక చేసినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని మంత్రి పదవుల రేసులో నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్‌, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌ మంత్రిపదవులకు పోటీ ప‌డే అవ‌కాశః ఉంద‌ని అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎస్టీని నియమిస్తే బాలూనాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేస్తే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు బాలూనాయక్‌ కూడా మంత్రి పదవి ద‌క్కించుకునే అవ‌కాశం ఉ ంది.

Revanth Reddy రేవంత్ రెడ్డి టీంలోకి కొత్త మంత్రులు వీహెచ్‌కి ఆ ప‌ద‌వి ద‌క్క‌నుందా

Revanth Reddy : రేవంత్ రెడ్డి టీంలోకి కొత్త మంత్రులు.. వీహెచ్‌కి ఆ ప‌ద‌వి ద‌క్క‌నుందా?

ఇక బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టును మున్నూరుకాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బీసీ కమిషన్‌ చైర్మన్ పదవికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు వి. హన్మంతరావు, గోపిశెట్టి నిరంజన్‌ లో ఒకరికి ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రైతు, విద్యా కమిషన్‌ చైర్మన్లుగా కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి పేర్లు ఖరారైనట్లు సమాచారం. అధిష్టానం దీనిపై మ‌రో రెండు రోజుల‌లో క్లారిటీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఆ త‌ర్వాత అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌నున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది