Revanth Reddy : జలద్రోహం చేసింది కేసీఆర్.. సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి
ప్రధానాంశాలు:
Revanth Reddy : జలద్రోహం చేసింది కేసీఆర్.. సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : గత కొద్ది రోజులుగా KCR కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి Revanth reddy విరుచుకు పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా Revanth reddy రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కృష్ణా జలాలు ఏపీ తరలించుకుపోతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వైఎస్ కు ఊడిగం చేసి కృష్ణా జలాలు సీమకు తరలించుకుపోయేందుకు సహకరించింది నువ్వు కాదా కెసిఆర్ అని ప్రశ్నించారు.

Revanth Reddy : జలద్రోహం చేసింది కేసీఆర్.. సంచలన విషయాలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి
Revanth Reddy రేవంత్ ఆగ్రహం..
వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని Ys Jagan ఇంటికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఆరు గంటల పాటు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు తరలించుకు పోతుంటే చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా .. ఇది ద్రోహం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. నువ్వు చేసిన పాపం ఇవాళ రాష్ట్రాన్ని వెంటాడుతుంది నిజం కాదా పదేళ్లలో సాగునీటి మంత్రులుగా ఉన్నది హరీష్, కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు…
ఈ పాపం మీది కాకపోతే ఇంకెవరిదని ప్రశ్నించారు. నీళ్లు రాయలసీమ తరలించుకుపోతే.. నిధులు కెసిఆర్ కుటుంబం తరలించుకుపోయిందని మండిపడ్డారు.జగన్ కు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి తెలంగాణ జలాలను ఏపీకి ఇచ్చారు అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.