Loan Waiver : రైతు సోదరులకు రేవంత్ సర్కార్ శుభవార్త… రుణమాఫీపై క్లారిటీ… అర్హులకు మాత్రమే ప్రయోజనాలు…!
Loan Waiver : 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూఅర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలియజేశారు. అయితే ఇటీవల తన సొంత నియోజకవర్గం పాలేరులో పర్యటించిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది అనర్హులు ప్రభుత్వ పథకాల లబ్ధిని పెద్ద మొత్తంలో పొందుతున్నారని తెలియజేశారు. కావున ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అనర్హులను గుర్తించి వారికి రేషన్ కార్డులు మరియు ఆసర పెన్షన్లను తొలగిస్తామని తెలియజేశారు.
Loan Waiver : రుణమాఫీపై క్లారిటీీ…
అదేవిధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రైతులకు కచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలియజేశారు. అయితే ఈ ప్రక్రియను వచ్చే నెల నుండి ప్రారంభిస్తామని రెండు లక్షల రుణమాఫీకి తెలంగాణ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని ఈ సందర్భంగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వాలు పేద ప్రజలకు గజం స్థలం కూడా ఇవ్వలేకపోయాయని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు కచ్చితంగా ఇల్లు నిర్మించి ఇస్తుందని తెలియజేశారు. అలాగే పాలేరు నియోజకవర్గంలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
Loan Waiver రుణమాఫీపై ప్రభుత్వ చర్యలు..
ఇది ఇలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే మొదట రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. రుణమాఫీ ఆలస్యం అవ్వడానికి గల కారణం లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం అని తెలంగాణ సర్కార్ తెలిపింది. దీనిలో భాగంగానే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం తీవ్రంగా కృషి చేస్తుంది. అయితే రైతు రుణమాఫీ కోసం దాదాపు 31 వేల కోట్ల అవసరమని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్ల మేర రుణాలను సేకరించెందుకు ఆర్బిఐ కూడా అనుమతించడంతో మిగతా మొత్తాన్ని వివిధ మార్గాలలో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.