Revanth Reddy : రేవంత్ రెడ్డి సెకండ్ ప్లాన్ అదేనా..?
ప్రధానాంశాలు:
Revanth Reddy : రేవంత్ రెడ్డి సెకండ్ ప్లాన్ అదేనా..?
Revanth Reddy : తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి వల్లో లేక తన సీటు పర్మినెంట్ కాదని రేవంత్ అనుకుంటున్నారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి తన సొంతంగా సెకండ్ ప్లాన్ వేసుకుంటున్నాడని అర్ధమవుతుంది. ఈక్రమంలోనే తన ఇదివరకు పార్టీ టీడీపీ మీద తన ప్రేమను చూపిస్తున్నారని తెలుస్తుంది. గత ఎన్నికల్లో టీడీపీ పోటా చేయకపోవడం వల్లే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు మీద గురు భక్తి చూపిస్తూనే ఉన్నాడు.ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల సీఎం ల మీటింగ్ లో కూడా బాబు తో సమానమైన పోస్ట్ అయినా కూడా చంద్రబాబు మీద రేవంత్ చూపించిన అభిమానం అందరికీ తెలిసిందే. ఐతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున సీమె కాగా బాబు మాత్రం కూటమి తరపున సీఎం అంటే అందులో బీజేపీ కూడా ఉంది. ఐతే రేవంత్ రెడ్డి ఇలా చేయడం వెనక పెద్ద ప్లానే ఉందని అంటున్నారు.
Revanth Reddy తన మద్ధతు పెంచుకునే పనిలో రేవంత్
తెలంగాణాలో గెలిచిన 65 మంది ఎమ్మెల్యేల్లో కేవలం పాతిక నుంచి 30 మంది మాత్రమే రేవంత్ కు సపోర్ట్ గా ఉన్నారు. మిగతా వారంతా కూడా రేవంత్ కి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే బి.ఆర్.ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక అక్కడ నుంచి వచ్చే వారంతా రేవంత్ కి సపోర్ట్ ఇచ్చేలా చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్లు ఏమైనా ఇబ్బంది పెట్టి బల పరీక్ష నిరూపించుకోవాల్సి వస్తే రేవంత్ తన సత్తా చాటాలని చూస్తున్నారు.
అంతేకాదు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడితే మళ్లీ టీడీపీ గూటికి వచ్చి ఎలాగు సీఎం క్యాండిడేట్ కాబట్టి తెలంగాణాలో కూడా ఆ పోస్ట్ కి అర్హత సాధించే ఛాన్స్ ఉంటుంది. సో కాంగ్రెస్ లోని గొడవల వల్ల రేవంత్ మీద ఇలా రకరకాల వార్తలు బయట సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఒక సీఎం అభ్యర్ధి మీద ఇలాంటి వార్తలు రావడం మాతర్మ్ ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.