Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీం.. ఏరోజు నుంచి అమలంటే.. వారికి 15000 జమ..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీం.. ఏరోజు నుంచి అమలంటే.. వారికి 15000 జమ..!
Rythu Bharosa Scheme : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్ధిక అవసరాలను తీర్చేందుకు వ్యవసాయ భూములకు మద్ధతు ఇచ్చేందుకు ఎకరానికి 15000 అందిచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీఈం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఎన్నికల్లో నెరవేర్చిన హామీలకు కట్టుబడి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ, వంట గ్యాస్ సబ్సీడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటివి ఇస్తున్నారు.
Rythu Bharosa Scheme భూయజమానులందరికీ ఇది మద్ధతినిచ్చేలా..
వీటితో పాటు రైతు భరోసా పథకం కూడా కీలకంగా మారింది. లోక్ సభ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా జూన్ 2024 వర్షాకాలం ప్రారంభమయ్యే టైం కు ఈ పథకం ప్రారంభించారు. ఐతు బందు పథకం లా కాకుండా భూయజమానులందరికీ ఇది మద్ధతినిచ్చేలా. ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ హోల్డింగ్ లను మినహాయించి సాగు చేసే భూములకు ఇది అందిస్తున్నారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హతగా ఫిక్స్ చేశారు. దీని వల్ల వ్యవసాయంలోనే ఉన్న వారికి మంచి ఆర్ధిక సాహాయం చేసినట్టు అవుతుంది.
రైతు బందు వేదికతో కొత్త పథకాన్ని అనుసంధానం చేసేలా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. 15000 ఆర్ధిక సహాయాన్ని వ్యవసాయ సమయంలో ఒకటి లేదా రెండు విడతలుగా ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ధిక స్థిరత్వం పెంచేలా చిన్న తరహా రైతుల జీవనోపాధి బలోపేతం చేసేలా ఈ పథకం సపోర్ట్ చేస్తుంది. ఐతే ఈ పథకంలో ఎలాంటి లొసుగులు జరగకుండా చూడాలని ప్రభుత్వం చూస్తుంది. ఎలాంటి పారదర్శకత లేకుండా ఉండాలని అధికారులను సూచిస్తున్నారు. ఐతే దీని గురించి మరిన్ని వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాల్సి ఉంది. చిన్నకారు రైతుల కోసమే ఈ పథకం ప్రవేశ పెట్టిందని ప్రభుత్వం చెబుతుంది.