Seethakka Vs Bandi Sanjay : బండి సంజయ్ మాటలపై సీతక్క కౌంటర్.. పరువులు తీయోద్దంటూ కౌంటర్
ప్రధానాంశాలు:
Seethakka Vs Bandi Sanjay : బండి సంజయ్ మాటలపై సీతక్క కౌంటర్.. పరువులు తీయోద్దంటూ కౌంటర్
Seethakka Vs Bandi Sanjay : ‘బీజేపీది BJP భారత్ టీం అని.. కాంగ్రెస్‌ది Congress పాకిస్థాన్ టీం’ అంటూ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ Bandi Sanjay చేసిన వ్యాఖ్యలకి మంత్రి Seethakka సీతక్క ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ BJP.. దేవుడికి వినియోగించే అగర్బత్తిల మీద కూడా GST వేసింది. ఉన్నత విద్య మీద 18 శాతం GST విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది. అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు.

Seethakka Vs Bandi Sanjay : బండి సంజయ్ మాటలపై సీతక్క కౌంటర్.. పరువులు తీయోద్దంటూ కౌంటర్
Seethakka Vs Bandi Sanjay సీతక్క ఫైర్
ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు. బండి సంజయ్ Bandi Sanjay.. పాకిస్థానీతో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు. బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు.. మాట్లాడడానికి రెండు మాటలు లేవు. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే.. భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్ధంలో పాల్గొనండి.
దేశ గౌరవాన్ని తనగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది. సంవత్సరకాలంలో 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నరేందర్ రెడ్డిని Narender Reddy గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి. భావోద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్‌కి, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పండి. ఈ చిల్లర మాటలు మానేయండి. ఇలాంటి విద్వేషాలు పూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తుంది.” అని మంత్రి సీతక్క అన్నారు.