SLBS Tunnel : టన్నెల్‌లో ఇరుక్కున్న 8 మంది ఎలా ఉన్నారు.. సవాల్‌గా మారిన రెస్క్యూ ఆపరేషన్
ప్రధానాంశాలు:
SLBS Tunnel : టన్నెల్‌లో ఇరుక్కున్న 8 మంది ఎలా ఉన్నారు.. సవాల్‌గా మారిన రెస్క్యూ ఆపరేషన్
SLBS Tunnel : మూడు రోజులు గడిచాయి! ఆచూకీ కోసం అన్వేషణ ఆగలేదు. 8మంది జాడ కనిపెట్టేందుకు సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి రెస్యూ బృందాలు అలుపెరుగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. నాగర్ కర్నూల్ Nagar kurnool జిల్లా దోమల పెంట సమీపంలో.. 14 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిపోగా.. టన్నెల్‌లో ఎనిమిది మంది సిబ్బంది చిక్కుకుపోవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

SLBS Tunnel : టన్నెల్‌లో ఇరుక్కున్న 8 మంది ఎలా ఉన్నారు.. సవాల్‌గా మారిన రెస్క్యూ ఆపరేషన్
అయితే.. అందులో చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ NDRF, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలతో పాటు హైడ్రా, ఇండియన్ ఆర్మీ, స్పెషల్ బెటాలియన్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
లోపల పెద్ద ఎత్తున మట్టి కూలటంతో పాటు నీళ్లు, బురద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. గతంలో ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ Tunnel ప్రమాదంలో 41 మంది కార్మికులను కాపాడిన బృందం రంగంలో దిగి.. 8 మందిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సహాయక చర్యలను మంత్రులు, ఉన్నతాధికారులంతా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అందులో ఉన్నవారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.