Seethakka Vs KCR : కార్యకర్తలని ఊహలోకంలోనే ఉంచండి.. కేసీఆర్‌కి సీతక్క కౌంటర్..!
ప్రధానాంశాలు:
Seethakka Vs KCR : కార్యకర్తలని ఊహలోకంలోనే ఉంచండి.. కేసీఆర్‌కి సీతక్క కౌంటర్..!
Seethakka Vs KCR : మంత్రి సీతక్క ఎక్కడ తగ్గడం లేదు. బీఆర్ఎస్ నాయకులకి గట్టి పంచ్‌లు ఇస్తుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్‌కి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ కార్యకర్తలను ఊహలోకం లోనే ఉంచండి.. మీరు ఫాంహౌజ్‌లోనే ఉండండి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీతక్క చురకలంటించారు.

Seethakka Vs KCR : కార్యకర్తలని ఊహలోకంలోనే ఉంచండి.. కేసీఆర్‌కి సీతక్క కౌంటర్..!
Seethakka Vs KCR సీతక్క కౌంటర్..
అధికారంలోకి వస్తామని అలానే కలలు కనండి. మేం మంచి పాలన అందించి మళ్లీ అధికారంలోకి వస్తామంటూ సీతక్క అన్నారు. మరోవైపు అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు’ అని సీతక్క చెప్పారు. ములుగు నియోజకవర్గంలో తాను తిరిగినట్లు నువ్వు తిరగలేవు అని చెప్పారు.
ప్రజలకు ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తమ ఇంటికి రావాలని మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్స్‌లోనే తాను నివసిస్తున్నానని స్పష్టం చేశారు. వైఎస్ భవనంలో ఉండటం తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.