SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
ప్రధానాంశాలు:
SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
SLBC Tunnel : శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ Srisailam Left Bank Canal Tunnel దగ్గర భారీ ప్రమాదం జరిగింది. దోమలపెంట దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోవడం జరిగింది ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పనులను ప్రారంభించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఎడమగట్టు కాలువ టన్నెల్ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు చేపట్టారు.

SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
SLBC Tunnel టెన్షన్ వాతావరణం..
టన్నెల్‌లో 40 మంది కార్మికులు Workers పని చేస్తుండగా.. 32 మంది తప్పించుకొని బయటపడ్డారు. మరో 8 మంది టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు గడిచిపోయింది. అయినా ఇప్పటి వరకు వారు బయటకు రాలేదు. బిక్కుబిక్కుమంటూ లోపలే గడుపుతున్నారు. దాంతో వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 11 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు భారీగా నిలిచి ఉంది. 11 కి.మీ నుంచి 14 కి.మీ వరకు ఎన్టీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది నడుచుకుంటూ వెళ్లారు. బోరింగ్ మిషన్ Boaring Mission రెండు వైపులా మట్టి, బురద భారీగా పేరుకుపోయింది. టన్నెల్‌లోని నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు.