Sonia Gandhi : రేవంత్‌కి సోనియా గాంధీ భరోసా.. తెలంగాణ ప్లాన్ సెట్
Sonia Gandhi : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్రస్తుతం ఫోకస్ మొత్తం తెలంగాణ మీద పెట్టింది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగానే ఉంది. దానికి కారణం.. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు. అక్కడ కాంగ్రెస్ గెలవడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ మొత్తం తెలంగాణ మీదికి మార్చేసింది.
అందుకే.. ఏఐసీసీ కీలక సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు ప్లస్ అయింది. ఆ నిర్ణయం తీసుకున్నది సోనియా గాంధీ. అంటే ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయిందంటే దానికి ప్రధాన కారణం సోనియా గాంధీ అనే చెప్పుకోవాలి. అందుకే సోనియా గాంధీనే ముందుండి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణకు వచ్చి బహిరంగ సభలో సోనియా పాల్గొననున్నారు.
Sonia Gandhi : కాంగ్రెస్ జాతీయ నేతలంతా తెలంగాణలోనే
ప్రస్తుతం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం హైదరాబాద్ లో జరుగుతుండటంతో కాంగ్రెస్ జాతీయ నేతలంతా తెలంగాణలోనే ఉన్నారు. రాహుల్ గాంధీతో సహా ముఖ్య నేతలంతా తెలంగాణలోనే మకాం వేశారు. రేవంత్ రెడ్డి సూచనతోనే హైదరాబాద్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు మామూలుగా లేవు. ఇవే స్ట్రాటజీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అనే చెప్పుకోవాలి.