Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2025,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

Konda Surekha : రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచు భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల లో దేవాదాయశాఖ భూమి అన్యక్రాంతం అవుతున్న ఫిర్యాదు మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ జిల్లా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.

Konda Surekha దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు మంత్రి కొండ సురేఖ

Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

Konda Surekha బోడుప్పల్ లో కబ్జాకు గురైన దేవాదాయ భూముల పరిశీలన

ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 33/8 లో 10.35 ఎకరాలు,33/9 లో 13 ఎకరాలు,33/10 లో 6.23 ఎకరాల చొప్పున మొత్తం 30.28 ఎకరాల భూమిని 1968 లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్ కు భూ పట్టదారులైన తోటకూర ఎల్లయ్య యాదవ్ ఇతరులు రామయ్య చౌదరి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976 సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించారని తెలిపారు.

దేవాదాయ శాఖ భూములు కబ్జాకు పాల్పడిందేవరైన సరే వదిలే ప్రసక్తే లేదని కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకొని కబ్జా దారులపై పీడీ యాక్ట్ పేడుతామని హెచ్చరించారు.మంత్రి వెంట పర్యటించిబ వారిలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్,కీసర అర్డీవో ఉపేందర్ రెడ్డి, మేడిపల్లి తహసీల్దారు హసీనా, దేవాదాయ శాఖ సర్వేయర్లు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది