Teenmaar Mallanna : కాంగ్రెస్ పార్టీ తరుపున తీన్మార్ మల్లన్న ప్రచారం.. ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారా?
ప్రధానాంశాలు:
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా?
తీన్మార్ మల్లన్న పోటీ చేయాలని అనుకుంటున్నారా?
ఎన్నికల ప్రచారం వైపు మొగ్గు చూపుతున్నారా?
Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తీన్మార్ మల్లన్న అంటేనే తెలంగాణలో ఒక బ్రాండ్. అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయనకు రాజకీయాలు పెద్దగా తెలియదు కానీ.. అధికార పార్టీ ఏ తప్పు చేసినా వెంటనే పట్టేసుకుంటారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారు. తెలంగాణ ప్రజలను అధికార పార్టీ ఎలా మోసం చేస్తున్నదో ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తారు. అందుకే తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణ ప్రజలకు గౌరవం. దాన్ని రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అసలే తెలంగాణలో ఎన్నికల కాలం కావడం వల్ల రాజకీయ పార్టీలు తీన్మార్ మల్లన్నకు వల వేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు ఆయన్ను చేర్చుకోవడానికి రెడ్ కార్పెట్ పరిచాయి. బీజేపీలో చేరి మళ్లీ అక్కడి సిద్ధాంతాలు నచ్చక పార్టీకి రాజీనామా చేశారు మల్లన్న.
అయితే.. ఇంకో నెల రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలతో ఆయన సత్సంబంధాలు నెరుపుతున్నారు. వాళ్లతో మంచిగా ఉంటున్నారు. పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగానే మల్లన్న ప్రవర్తిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీలో మల్లన్నను చేర్చుకునేందుకు హైకమాండ్ కూడా ఆసక్తి చూపిస్తోంది. కానీ.. ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. యూత్ కి స్ఫూర్తిగా ఉన్న మల్లన్న పార్టీలోకి వస్తే అది చాలా ప్లస్ అవుతుందని హైకమాండ్ కూడా భావిస్తోంది. అలాగే.. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ప్రస్తుతానికి మల్లన్నను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోవాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Teenmaar Mallanna : మల్లన్న ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారా?
నిజానికి తీన్మార్ మల్లన్న ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. మేడ్చల్ నుంచి పోటీ చేస్తా అని కూడా ప్రకటించారు. కానీ.. అది ఏ పార్టీ నుంచో తెలపలేదు. ఆయనే కొత్త పార్టీ పెడతారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఖచ్చితమైన హామీ ఇస్తే వెంటనే ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే కరెక్ట్ అనుకొని ఆ పార్టీలో చేరేందుకు మల్లన్న ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.