Free Gold Scheme : తెలంగాణ మహిళలకు ఉచిత బంగారు పథకం… శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి…!
ప్రధానాంశాలు:
Free Gold Scheme : తెలంగాణ మహిళలకు ఉచిత బంగారు పథకం... శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి...!
Free Gold Scheme : తెలంగాణ రాష్ట్రంలో మహిళ సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచిత బంగారం అందజేయనున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు అమలుపై దృష్టి సారించి ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించడంలో ప్రజా పాలన కార్యక్రమం కీలకంగా మారింది.అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అందించడంతోపాటు , ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం , అనేక రకాల సంక్షేమ పథకాలను ఇప్పటికే అమలు చేశారు. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా అర్హులైన కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందించడం జరిగింది.
ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి మేలు జరగాలని లక్ష్యంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా వినూత్న పథకాలు రూపొందిస్తున్నారు.అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నిబద్ధతకు అనుగుణంగా మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాలను ప్రవేశ పెడుతూ వస్తున్నారు.ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇల్లు యోజన పథకాన్ని మార్చి 21న ప్రారంభించాలని అలాగే మహిళలకు ప్రయోజనం చేకూర్చే మరో పథకాన్ని అతి త్వరలోనే ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 12న లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఆ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు రకాల కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు.
కళ్యాణ లక్ష్మి తులం బంగారం
అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల ద్వారా పెళ్లైన ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ పథకం ద్వారా నగదు అందుకునేవారు . అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు తులం బంగారం కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు నగదు మరియు బంగారు ఆభరణాలు అందుకొనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆడబిడ్డకు న్యాయం జరిగేలా చూడాలని ఈ ప్రాజెక్టు పై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పథకంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది.