Telangana ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ .. ఎంతమంది ఓట్లు వేసారంటే..!! అత్యధిక పోలింగ్ ఆ జిల్లాలోనే… !!
ప్రధానాంశాలు:
Telangana ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ .. ఎంతమంది ఓట్లు వేసారంటే..!! అత్యధిక పోలింగ్ ఆ జిల్లాలోనే
Telangana Assembly elections complete
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
Telangana తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28% నమోదు అవ్వగా అత్యల్పంగా హైదరాబాదులో 39.97 పోలింగ్ నమోదయింది. మరోవైపు ఎన్నికల పోలింగ్ సమయంలోపు క్యూ లైన్ లో నిలబడిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. అయితే 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ పూర్తయింది. బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్, భద్రాద్రి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, అశ్వరావుపేట ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది.
మిగతా అన్ని జిల్లాలలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్నిచోట్ల పోలింగ్ సమయం అయిపోయిన క్యూ లైన్ లో నిలబడ్డ వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా మెదక్ జిల్లాలోని పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. మెదక్ తర్వాత జనగాంలో 80.23 శాతం, యాదాద్రి భువనగిరి లో 78.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇక అత్యల్పంగా హైదరాబాదులో పోలింగ్ నమోదు కాగా హైదరాబాద్ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 49.25 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే పట్టణాలలోని అత్యల్ప పోలింగ్ నమోదయినట్లుగా తెలుస్తుంది.
ఐదు గంటల తర్వాత కూడా ఓటింగ్ ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల వరకే పోలింగ్ స్టేషన్ లోకి ఓటర్లను అనుమతించారు. దీంతో ఇప్పుడు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల గురువారంతో ముగిసింది. ఛతిస్ ఘడ్ , రాజస్థాన్ , మధ్యప్రదేశ్, మిజోరం లో ఆల్రెడీ పోలింగ్ పూర్తయింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ఎన్నికల సంఘం ప్రకటించనున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం 5:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.