Telangana Cabinet : రేవంత్ రెడ్డి కేబినేట్‌లోకి కొత్త మంత్రులు.. ఎవ‌రికి ఏయే శాఖ‌లు కేటాయించ‌నున్నారంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Cabinet : రేవంత్ రెడ్డి కేబినేట్‌లోకి కొత్త మంత్రులు.. ఎవ‌రికి ఏయే శాఖ‌లు కేటాయించ‌నున్నారంటే..!

Telangana Cabinet : తెలంగాణ లో కొత్త ప్ర‌భుత్వం కొలువు దీరి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే రేవంత్ టీం ప‌రిపాల‌నపై కొంత విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఖాళీల భర్తీ తో పాటుగా శాఖల మార్పు పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ఢిల్లీలో అధినాయ‌క‌త్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది.రాష్ట్రంలో హైడ్రా వివాదం […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 October 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Cabinet : రేవంత్ రెడ్డి కేబినేట్‌లోకి కొత్త మంత్రులు.. ఎవ‌రికి ఏయే శాఖ‌లు కేటాయించ‌నున్నారంటే..!

Telangana Cabinet : తెలంగాణ లో కొత్త ప్ర‌భుత్వం కొలువు దీరి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే రేవంత్ టీం ప‌రిపాల‌నపై కొంత విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఖాళీల భర్తీ తో పాటుగా శాఖల మార్పు పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ఢిల్లీలో అధినాయ‌క‌త్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది.రాష్ట్రంలో హైడ్రా వివాదం తో పాటుగా ప్రస్తుత పరిణామాల పైన ఆయ‌న చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది.

Telangana Cabinet ఎవ‌రికి అదృష్టం దక్క‌నుందో..!

అలానే మంత్రివర్గ విస్తరణ…నామినేటెడ్ పెండింగ్ పదవుల భర్తీ పైన చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో తీసుకొనే వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద ఉన్న హోం శాఖ సీతక్కకు కేటాయించటం దాదాపు ఖాయం..ఇక‌ నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్‌లో స్థానం దక్కుతుంద‌ని తెలుస్తుండ‌గా, సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Telangana Cabinet రేవంత్ రెడ్డి కేబినేట్‌లోకి కొత్త మంత్రులు ఎవ‌రికి ఏయే శాఖ‌లు కేటాయించ‌నున్నారంటే

Telangana Cabinet : రేవంత్ రెడ్డి కేబినేట్‌లోకి కొత్త మంత్రులు.. ఎవ‌రికి ఏయే శాఖ‌లు కేటాయించ‌నున్నారంటే..!

రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఇక వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం ఖాయమైందని తెలుస్తోంది. అదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి మంత్రి పదవి దక్కనుందని అంటున్నారు. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా..నాలుగు భర్తీ చేసి రెండు స్థానాలు ఖాళీగా ఉంచుతారని తెలుస్తోంది. మైనార్టీ, ఎస్టీల కోసం మరో బెర్తు ఖాళీగా ఉంచనున్నట్లు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు పట్టు చిక్కలేదు. దీంతో, గ్రేటర్ ఎన్నికల్లోగా హైదరాబాద్ లో బలం పెంచుకునేలా కొత్త వ్యూహాల తో ముందుకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ నుంచి ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది