Telangana Cabinet : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకి వేళాయే.. లిస్ట్‌లో ఉన్నవారెవరు అంటే..!
ప్రధానాంశాలు:
Telangana Cabinet : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకి వేళాయే.. లిస్ట్‌లో ఉన్నవారెవరు అంటే..!
Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లడంతో అందరిలో అనుమానాలు ఎక్కువయ్యాయి.. దాదాపు 15 నెలలుగా మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ నేతలను ఊరిస్తోంది. రకరకాల కారణాలతో ఇన్నాళ్లు ఆలస్యమైంది.

Telangana Cabinet : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకి వేళాయే.. లిస్ట్‌లో ఉన్నవారెవరు అంటే..!
Telangana Cabinet ఉగాది తర్వాత..
స్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పోస్టులు ఖాళీగా ఉండగా.. ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై కూడా అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ హుటాహుటిన ఢిల్లీకి పయనమైనట్టు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఆరు పోస్టుల కోసం రాష్ట్రంలోని పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో మంతనాలు కూడా చేస్తున్నారు.
అయితే.. ఈ ఆరు మంత్రి పదవులను గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాలతో పాటు ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపదికన ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. బీసీ, ఎస్సీ, రెడ్డి, మైనారిటీ లేదా ఎస్టీకి ఒకటి చొప్పున ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బీసీల్లో మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ, ముదిరాజ్ వర్గాలకు చెందిన నేతలకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.పరిశీలనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డిల పేర్లు ఉన్నాయి. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను తొలగించి విజయశాంతికి, ప్రేమ్ సాగర్ రావులకు అవకాశం ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.