CM KCR : అలాంటి వాళ్లను బయటికి గెంటేస్తా.. సీఎం కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM KCR : అలాంటి వాళ్లను బయటికి గెంటేస్తా.. సీఎం కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు

 Authored By kranthi | The Telugu News | Updated on :22 August 2023,2:00 pm

CM KCR : సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 115 నియోజకవర్గాల్లో ఒకేసారి మీడియా ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు వేరే ఏ పార్టీ కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. సీఎం కేసీఆర్ మాత్రం ఒక అడుగు ముందుకేసి 115 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. దాదాపుగా అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. కొన్ని చోట్ల మాత్రమే అభ్యర్థులను మార్చారు.

115 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు కాగా.. ఒక నాలుగు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఆ నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఏడుగురు ఎమ్మెల్యేలను మార్చారు. అందులో కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉండగా ఆ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్, కామారెడ్డి ఈ రెండు నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు.

BRS party assembly candidates list ready

BRS party assembly candidates list ready

CM KCR : గంప గోవర్ధన్ రిక్వెస్ట్ తోనే కేసీఆర్ పోటీ చేస్తున్నారా?

అయితే.. కామారెడ్డిలో మీరు పోటీ చేయాలని.. గంప గోవర్ధన్.. కేసీఆర్ ను రిక్వెస్ట్ చేశారు. దీంతో కేసీఆర్ ఒప్పుకొని కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపించారు. అందుకే కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక.. మీడియా ముందే.. పార్టీలో ఎవరైనా సరే టికెట్ ఇవ్వలేదని యాంటీ పాలిటిక్స్ చేయాలని చూస్తే మాత్రం పార్టీ నుంచే గెంటేస్తానని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే టికెట్స్ రాని కొందరు నేతలు వేరే పార్టీలో చేరేందుకు సుముఖత చూపిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది