Revanth Reddy : ఆ విష‌యంలో చంద్ర‌బాబుకి గ‌ట్టి పంచే ఇచ్చిన రేవంత్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : ఆ విష‌యంలో చంద్ర‌బాబుకి గ‌ట్టి పంచే ఇచ్చిన రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల భేటిపై కొన్ని రోజుల నుండి ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. ఎట్ట‌కేల‌కి గ‌త రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు భేటి అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2024,1:00 pm

Revanth Reddy : తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల భేటిపై కొన్ని రోజుల నుండి ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. ఎట్ట‌కేల‌కి గ‌త రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు భేటి అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కరించుకోవాలని వారు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తుంది. అలాగే షెడ్యూల్‌ 10లోని అంశాలపైనే ముఖ్యంగా చర్చించారు. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఇరు రాష్ట్రాల సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Revanth Reddy స్ట్రాంగ్‌గా ఉన్న రేవంత్

భద్రాచంలోని ఏపీలో కలిపిన 7 మండలాల్లో ఐదు గ్రామాలను తెలంగాణ అడిగింది. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఏపీ కోరగా.. తెలంగాణ దానికి తిరస్కరించింది. ఏపీనే తమకి బకాయిలు తిరిగి చెల్లించాల్సి ఉందని బదులిచ్చింది.హైదరాబాద్‌లోని కొన్ని భవనాలను ఏపీకి కేటాయించాలని చంద్రబాబు కోరగా.. తెలంగాణలో ఉన్న స్థిరాస్తులన్నీ తమకే చెందుతాయని రేవంత్ బదులిచ్చారు.

Revanth Reddy ఆ విష‌యంలో చంద్ర‌బాబుకి గ‌ట్టి పంచే ఇచ్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : ఆ విష‌యంలో చంద్ర‌బాబుకి గ‌ట్టి పంచే ఇచ్చిన రేవంత్ రెడ్డి..!

చర్చల ద్వారా, పట్టు విడుపులతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని సమాచారం. నీటి కేటాయింపులపై మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కలిపిన 7 ముంపు మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి అడిగారని సమాచారం..విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సీఎంలు ముందుకు రావడం హర్షించదగిన పరిమాణం అని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు ఏపీలో సైతం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది