Telangana Congress : క్యాంపు రాజకీయాలు షురూ.. ‘కారెక్కకుండా’ జాగ్రత్త పడుతున్న కాంగ్రెస్..!
Telangana Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు.. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు కనిపిస్తోంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎగ్జిట్ పోల్స్, సర్వేలు.. ఏవి చూసినా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర్లో కాంగ్రెస్ ఉండబోతోందని.. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని చెబుతున్నారు. కానీ.. ఫలితాలు వచ్చేదాకా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడం మాత్రం కష్టమే. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే ఉండటంతో ఇక కాంగ్రెస్ […]
ప్రధానాంశాలు:
డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ బెంగళూరు
గెలిచిన అభ్యర్థులు నేరుగా బెంగళూరుకు
70 స్థానాలు కాంగ్రెస్ కు పక్కానా?
Telangana Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు.. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు కనిపిస్తోంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎగ్జిట్ పోల్స్, సర్వేలు.. ఏవి చూసినా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర్లో కాంగ్రెస్ ఉండబోతోందని.. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని చెబుతున్నారు. కానీ.. ఫలితాలు వచ్చేదాకా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడం మాత్రం కష్టమే. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే ఉండటంతో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం ఖాయం అని భావిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటితే నో టెన్షన్ కానీ.. ఒకవేళ తెలంగాణలో హంగ్ ఏర్పడితే ఏంటి పరిస్థితి. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను కాపాడుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. దాని కోసమే ఆపరేషన్ బెంగళూరును తెలంగాణ కాంగ్రెస్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
70 స్థానాలకు పైగా ఈసారి కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా అన్ని స్థానాలు గెలుస్తామని ధీమాతో ఉంది. అందుకే.. ఒకవేళ గెలిచాక తమ పార్టీ అభ్యర్థులు వేరే పార్టీలోకి జంప్ కాకుండా ఉండేందుకు.. ఖచ్చితంగా గెలుస్తారు అని ధీమా ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 3న అంటే ఎల్లుండే తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల ఫలితాలకు ముందు రోజు అంటే డిసెంబర్ 2నే గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించబోతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ఆపరేషన్ స్టార్ట్ అవనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో అయితేనే తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సేఫ్టీ ఉంటుందని భావించి.. అక్కడ డీకే శివకుమార్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సారథ్యం వహిస్తారని తెలుస్తోంది.
Telangana Congress : కేసీఆర్ కంట్లో పడక ముందే బెంగళూరుకు
అయితే.. డిసెంబర్ 2న ఎమ్మెల్యే అభ్యర్థులను తరలించాలా.. లేక గెలిచిన తర్వాత డిసెంబర్ 3న తరలించాలా అనేదానిపై ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ కు క్లారిటీ లేదు. అయితే.. కాంగ్రెస్ నుంచి ఎంత మంది గెలిస్తే అంతమందిని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. ఆయనకు ఇప్పుడు అన్ని రకాల బలాలు ఉన్నాయి. అందుకే హంగ్ వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఖచ్చితంగా కేసీఆర్ కు మద్దతు ఇస్తారు. ఎంఐఎం ఎలాగూ ఉంది. అందుకే ఎంఐఎం, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేస్తారు కేసీఆర్. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కు దొరకకుండా.. గెలిచినట్టు తెలియగానే… గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ బెంగళూరుకు తరలించి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు అక్కడే క్యాంపులో ఉంచాలని హైకమాండ్ భావిస్తోంది. చూడాలి మరి డిసెంబర్ 3న ఏం జరుగుతుందో?