Congress MLA Candidates List : కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ.. చాన్స్ దక్కింది వీరికే?
Congress MLA Candidates List : తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీగానే వ్యూహాలు పన్నుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల ముందుగానే తమ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. అయినా కూడా ఇంకా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల వల్ల ప్రస్తుతం పార్టీలో అలజడి మొదలైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ లో అంతర్గత పోరు మొదలవడం.. కొందరు నేతలు చివరకు పార్టీని వీడటం కూడా జరిగింది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చాలా జాగ్రత్తగా లిస్టును తయారు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదటి లిస్టును తయారు చేసిందట. మొన్నటి వరకు 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఉన్నిది 119 నియోజకవర్గాలే కానీ.. దరఖాస్తులు మాత్రం వేలల్లో వచ్చాయి.
ఆ దరఖాస్తుల్లో నుంచి 119 నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేసి తొలి లిస్టును కాంగ్రెస్ హైకమాండ్ రెడీ చేసిందట. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడంతో హైకమాండ్ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ఇక వడపోతపై దృష్టి సారించారు. వచ్చే నెల రెండో వారంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎక్కువ మంది పోటీలో ఉన్న అభ్యర్థుల నియోజకవర్గాలను ఇప్పుడే ప్రకటించకుండా.. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే ప్రస్తుతం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Congress MLA Candidates List
నియోజకవర్గాలో ప్రజా బలం, ప్రత్యర్థులను ఎదుర్కునే సత్తా ఎవరికి ఉంది.. సర్వేలో ఎవరికి అనుకూలంగా వచ్చిందో వాటి ఆధారంగా కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల రెండో వారంలో టికెట్లు ఖరారు చేయనుంది. అప్పటి వరకు ఎవరికైతే టికెట్ రాదో వాళ్లను కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. టికెట్స్ రానివాళ్లు రెబల్ గా మారి అదే నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నిలబడే అవకాశం రాకూడదని.. ఆ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాంటి సమస్య లేని 60 నుంచి 70 నియోజకవర్గాలకు మాత్రం ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. మిగితా నియోజకవర్గాలకు ఆ తర్వాత వీలు చూసుకొని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.